రేపు డిశ్చార్జ్ కానున్న ప్రత్యూష
కన్నతండ్రి, సవతితల్లి చేతుల్లో చిత్రహింసల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష కోలుకుంది. ఆమె ఈనెల 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్. శరత్‌కుమార్ హైకోర్టుకు తెలిపారు. ప్రత్యూషను సోమవారం కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా, ఆమె డిశ్చార్జ్ కానందున బుధవారం కోర్టులో ప్రవేశ పెడతామని ఆయన ధర్మాసనానికి తెలిపారు. దీంతో, ప్రత్యూషను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తమ చాంబర్ వద్దకు తీసుకురావాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం […]
Advertisement
కన్నతండ్రి, సవతితల్లి చేతుల్లో చిత్రహింసల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష కోలుకుంది. ఆమె ఈనెల 29న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్. శరత్‌కుమార్ హైకోర్టుకు తెలిపారు. ప్రత్యూషను సోమవారం కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా, ఆమె డిశ్చార్జ్ కానందున బుధవారం కోర్టులో ప్రవేశ పెడతామని ఆయన ధర్మాసనానికి తెలిపారు. దీంతో, ప్రత్యూషను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తమ చాంబర్ వద్దకు తీసుకురావాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ప్రత్యూషను కోర్టుకు తీసుకు వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Advertisement