సెన్సార్ ఆఫీస్ లోనే పైరసీ

మలయాళంలో ఈమధ్య విడుదలైన ప్రేమమ్ సినిమా సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా హక్కుల్ని తెలుగు నిర్మాత స్రవంతి రవికిషోర్ భారీ మొత్తానికి దక్కించుకున్న విషయం కూడా చాలామందికి తెలుసు. అయితే విడుదలైన 4 రోజులకే ఈ సినిమా పైరసీ బారినపడింది. అద్భుతమైన హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ మార్కెట్లోకి వచ్చేసింది. సినిమా సూపర్ హిట్టయినప్పటికీ, ఈ పైరసీ ఎఫెక్ట్ వల్ల ప్రేమమ్ సినిమా వసూళ్లు బాగా పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన […]

Advertisement
Update:2015-07-28 06:30 IST
మలయాళంలో ఈమధ్య విడుదలైన ప్రేమమ్ సినిమా సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా హక్కుల్ని తెలుగు నిర్మాత స్రవంతి రవికిషోర్ భారీ మొత్తానికి దక్కించుకున్న విషయం కూడా చాలామందికి తెలుసు. అయితే విడుదలైన 4 రోజులకే ఈ సినిమా పైరసీ బారినపడింది. అద్భుతమైన హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ మార్కెట్లోకి వచ్చేసింది. సినిమా సూపర్ హిట్టయినప్పటికీ, ఈ పైరసీ ఎఫెక్ట్ వల్ల ప్రేమమ్ సినిమా వసూళ్లు బాగా పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన ఏంటీ-పైరసీ పోలీసులు అసలు పైరసీకి కారణం సెన్సార్ ఆఫీసే అని తెలుసుకున్నారు. పైరసీ అయిన ప్రింట్ లో సెన్సార్ వాటర్ మార్క్ కూడా ఉండడం గమనించిన పోలీసులు, ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేసి అసలైన నిందితుల్ని కనిపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు టీనేజర్లను అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా మలయాళం సెన్సార్ బోర్డు సభ్యుల్ని కూడా అరెస్ట్ చేశారు. ఓ సినిమా ఏకంగా సెన్సార్ ఆఫీస్ లోనే పైరసీకి గురవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పైరసీకి పాల్పడిన సదరు ముగ్గురు ఉద్యోగుల్ని సెన్సార్ బోర్డు నుంచి నెలన్నర కిందటే సస్పెండ్ చేశారు.ఇప్పుడు పోలీసులు వాళ్లని అదుపులోకి తీసుకున్నారు.
Tags:    
Advertisement

Similar News