హైదరాబాద్‌కు పాలమూరు నీళ్లు
జంటనగరాల ప్రజలకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మంచినీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జంటనగరాల్లో సుమారు కోటీ 20 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరికి ఏడాదికి 42.58 టీఎంసీల నీరు అవసరమవుతుంది. చెరువులు, మంజీరా నీటితో కలుపుకుంటే 32 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దీంతో జంటనగరాల ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీటి కొరతను నివారించేందుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తరలించాలని ముఖ్యమంత్రి సోమవారం అధికారులను ఆదేశించారు. […]
Advertisement
జంటనగరాల ప్రజలకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మంచినీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. జంటనగరాల్లో సుమారు కోటీ 20 లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరికి ఏడాదికి 42.58 టీఎంసీల నీరు అవసరమవుతుంది. చెరువులు, మంజీరా నీటితో కలుపుకుంటే 32 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. దీంతో జంటనగరాల ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నీటి కొరతను నివారించేందుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తరలించాలని ముఖ్యమంత్రి సోమవారం అధికారులను ఆదేశించారు. భవిష్యత్ అవసరాల కోసం దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని, పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా హైదరాబాద్‌కు నీళ్లు తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన పథకాన్ని రూపొందించాలని ఆయన అధికారులను కోరారు.
Advertisement