తెలంగాణకు కొత్త జాతీయ రహదారులు
తెలంగాణకు కొత్త జాతీయ రహదారులను ప్రకటిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో 1,018 కి.మీ మేర జాతీయ రహదారులను ప్రకటిస్తామని ఆయనను కలిసిన రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీ. ఎంపీల బృందానికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రాబల్యమున్న ప్రాంతాల్లో అప్రోచ్ రోడ్డను నిర్మించాలని, రాష్ట్ర రహదారుల సమస్యలను పరిష్కారం వంటి అంశాలను ఎంపీలు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ రహదారులుగా ప్రకటించనున్న […]
Advertisement
తెలంగాణకు కొత్త జాతీయ రహదారులను ప్రకటిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ హామీ ఇచ్చారు. వచ్చే ఐదేళ్లలో 1,018 కి.మీ మేర జాతీయ రహదారులను ప్రకటిస్తామని ఆయనను కలిసిన రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీ. ఎంపీల బృందానికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రాబల్యమున్న ప్రాంతాల్లో అప్రోచ్ రోడ్డను నిర్మించాలని, రాష్ట్ర రహదారుల సమస్యలను పరిష్కారం వంటి అంశాలను ఎంపీలు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ రహదారులుగా ప్రకటించనున్న 1,018 కి.మీలతో 220 కి.మీ. కోదాడ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, జడ్చర్ల వరకు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి మంత్రిని కోరారు. ఎంపీల బృందం చేసిన విజ్ఞప్తులకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ప్రకటన చేస్తానని హామీ ఇచ్చారు.
Advertisement