పొరుగు రాష్ట్రాల మాదిరిగా ముస్లింలకు రిజర్వేషన్లు: కేసీఆర్
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్ల విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ముస్లింల జీవన విధానంపై సమగ్ర అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదిక అందిన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో కమిషన్ ఎంక్వైరీస్ పనితీరు, కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మజ్లిస్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, కమిటీ సభ్యులు […]
Advertisement
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్ల విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ముస్లింల జీవన విధానంపై సమగ్ర అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదిక అందిన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో కమిషన్ ఎంక్వైరీస్ పనితీరు, కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో మజ్లిస్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కమిషన్ సభ్యులు జిల్లాల్లో పర్యటించి ముస్లింలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకోవాలని సీఎం సూచించారు. ముస్లింల అభివృద్ధికి అవసరమైన స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Advertisement