అగ్రిగోల్డ్ నిందితులను అరెస్టు చేయరా?: హైకోర్టు
డిపాజిట్ల పేరుతో తెలుగు రాష్ట్రాల సామాన్య ప్రజలను నిలువునా ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారంపై రెండు ప్రభుత్వాల ఉదాసీనతను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇంత పెద్ద కుట్ర కేసులో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి.బొసాలేతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాలను ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ సేకరించిన డిపాజిట్లపై ఇప్పటి వరకూ ఏం చర్యలు తీసుకున్నారు? ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయి? ఆ పరిస్థితిపై సమాచారాన్ని తమ ముందుంచాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం […]
Advertisement
డిపాజిట్ల పేరుతో తెలుగు రాష్ట్రాల సామాన్య ప్రజలను నిలువునా ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారంపై రెండు ప్రభుత్వాల ఉదాసీనతను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇంత పెద్ద కుట్ర కేసులో ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి.బొసాలేతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాలను ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ సేకరించిన డిపాజిట్లపై ఇప్పటి వరకూ ఏం చర్యలు తీసుకున్నారు? ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయి? ఆ పరిస్థితిపై సమాచారాన్ని తమ ముందుంచాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను ఆగస్టు 3 కు వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యానికి వ్యక్తిగతంగా కోర్టు నోటీసులు అందచేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి సూచించింది.
Advertisement