రెండు ఓట్లుంటే చర్యలు " భన్వర్‌లాల్
ఓటర్ కార్డుతో అనుసంధానమైన తర్వాత కూడా ఎవరైనా రెండు ఓట్లను కలిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. వారికి కోర్టు ఆదేశాలతో జరిమానా, జైలు శిక్ష విధిస్తామని ఆయన హెచ్చరించారు. సెప్టెంబరులో లోగా ప్రతి ఓటరు తన ఆధారకార్డుతో అనుసంధానం చేసుకోవాలని అందుకోసం బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఆ శిబిరాన్ని సందర్శించిన ఆయన ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధాన […]
Advertisement
ఓటర్ కార్డుతో అనుసంధానమైన తర్వాత కూడా ఎవరైనా రెండు ఓట్లను కలిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. వారికి కోర్టు ఆదేశాలతో జరిమానా, జైలు శిక్ష విధిస్తామని ఆయన హెచ్చరించారు. సెప్టెంబరులో లోగా ప్రతి ఓటరు తన ఆధారకార్డుతో అనుసంధానం చేసుకోవాలని అందుకోసం బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఆ శిబిరాన్ని సందర్శించిన ఆయన ఆధార్‌తో ఓటరు కార్డు అనుసంధాన ప్రక్రియ వివరాలను తెలుసుకున్నారు. తెలంగాణలో 70 శాతం, గ్రేటర్ హైదరాబాద్‌లో 35 శాతం ఆధార్ అనుసంధానం పూర్తయిందని ఆయన తెలిపారు.
Advertisement