ఆగస్టు 1 నుంచి స్వచ్ఛతా సమరం
తెలంగాణలో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి అక్టోబరు 2 వరకూ స్వచ్ఛతా సమరం నిర్వహించనుంది. అరవై రోజులపాటు కొనసాగే ఈ సమరంలో కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. తొలివారం ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన సదస్సులు నిర్వహించి రెండో వారం విద్యార్ధులకు పోటీలు, మూడోవారం వర్క్‌షాపులు నిర్వహిస్తారు. వర్క్‌షాపుల్లో ప్రజాప్రతినిధులతోపాటు అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తారు. 20 మంది సభ్యులతో […]
Advertisement
తెలంగాణలో పారిశుద్ధ్యానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం ఆగస్టు 1 నుంచి అక్టోబరు 2 వరకూ స్వచ్ఛతా సమరం నిర్వహించనుంది. అరవై రోజులపాటు కొనసాగే ఈ సమరంలో కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. తొలివారం ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన సదస్సులు నిర్వహించి రెండో వారం విద్యార్ధులకు పోటీలు, మూడోవారం వర్క్‌షాపులు నిర్వహిస్తారు. వర్క్‌షాపుల్లో ప్రజాప్రతినిధులతోపాటు అన్నివర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తారు. 20 మంది సభ్యులతో సిటీ శానిటేషన్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తారు. వీరు నిరంతరం నగర పురోభివృద్ధిపై వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది.
Advertisement