త్వరలో నగదు రహిత చికిత్స: ప్రధాని
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే తమ ప్రభుత్వం రోడ్డు రవాణా, భద్రత బిల్లును ప్రవేశపెడుతుందని, రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సనందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని చెప్పారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో భాగంగా మాట్లాడుతూ భారత్‌లో ప్రతినిమిషానికో ప్రమాదం జరుగుతున్నదని, ప్రతి నాలుగు నిమిషాలకో మరణం చోటుచేసుకుంటుందని తెలిపారు. మృతుల్లో మూడింట ఒకవంతు మంది 15-25 ఏండ్ల […]
Advertisement
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే తమ ప్రభుత్వం రోడ్డు రవాణా, భద్రత బిల్లును ప్రవేశపెడుతుందని, రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సనందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని చెప్పారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్‌లో భాగంగా మాట్లాడుతూ భారత్‌లో ప్రతినిమిషానికో ప్రమాదం జరుగుతున్నదని, ప్రతి నాలుగు నిమిషాలకో మరణం చోటుచేసుకుంటుందని తెలిపారు. మృతుల్లో మూడింట ఒకవంతు మంది 15-25 ఏండ్ల మధ్య వయస్కులేనని అన్నారు. త్వరలో రోడ్డు భద్రత బిల్లును తీసుకొచ్చి, ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సనందిస్తామని చెప్పారు. బాధితుడు తొలి 50 గంటలపాటు తన చికిత్సకయ్యే ఖర్చును ఎవరు భరిస్తారన్న విషయమై సందిగ్దతతో కొన్ని ప్రాణాలు పోతున్నాయని, ఇక ఆ చింత లేకుండా వైద్యానికి అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని ప్రధాని తెలిపారు. ఈ ప్రాజెక్టును తొలుత గుర్గావ్, జైపూర్, వడోదర ఆ తరువాత ముంబై, రాంచీ, రుంగావ్, మౌర్య జాతీయ రహదారుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని భారత ప్రధాన మంత్రి మోడీ పేర్కొన్నారు. రహదారి భద్రతపై తల్లిదండ్రులు..పిల్లలకు మార్గదర్శనం చేయాలని సూచించారు. దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి మరణాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది వర్షాకాలం బాగా ప్రారంభం అయిందని, రైతులు ఖరీఫ్ పంటలు పండించేందుకు వర్షాలు దోహదపడుతాయని తెలిపారు. దీనదయాళ్ ఉపాధ్యాయ్ గ్రామ జ్యోతి యోజన కింద ప్రతి గ్రామానికి 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తామని తెలిపారు.
Advertisement