పింఛన్ రాక కళాకారుల అవస్థలు
అభినయం, వాచకం, నటనతో పదికాలాల పాటు ప్రేక్షకులను మెప్పించిన మూడు వేల మందికి పైగా వృద్ధ రంగస్థల కళాకారులు ఇప్పుడు పేదరికంతో సహజీవనం చేస్తున్నారు. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టడంతో మూడు నెలలుగా వారికి పింఛన్ కూడా అందడం లేదు. దీంతో బతుకు భారమైన వృద్ధ కళాకారులు తమ బతుకు ఎలా తెల్లారుతుందోనని భయపడుతున్నారు. బడ్జెట్ లేని కారణంగా వృద్ధ కళాకారుల పింఛన్ నిలిపి వేయాలని తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖను మార్చిలో ఆదేశించింది. దీంతో […]
Advertisement
అభినయం, వాచకం, నటనతో పదికాలాల పాటు ప్రేక్షకులను మెప్పించిన మూడు వేల మందికి పైగా వృద్ధ రంగస్థల కళాకారులు ఇప్పుడు పేదరికంతో సహజీవనం చేస్తున్నారు. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టడంతో మూడు నెలలుగా వారికి పింఛన్ కూడా అందడం లేదు. దీంతో బతుకు భారమైన వృద్ధ కళాకారులు తమ బతుకు ఎలా తెల్లారుతుందోనని భయపడుతున్నారు. బడ్జెట్ లేని కారణంగా వృద్ధ కళాకారుల పింఛన్ నిలిపి వేయాలని తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖను మార్చిలో ఆదేశించింది. దీంతో రాష్ట్రంలోని మూడు వేల మందికి పైగా కళాకారులు ఆకలితో అలమటిస్తున్నారు. గతంలో ఉన్న పెన్షన్ రూ. 500 నుంచి రూ.1500 పెంచుతూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో అర్హులైన కళాకారుల వివరాలు పంపాలని సాంస్కృతిక శాఖ అధికారులు జిల్లా డీపీఆర్వోలను ఆదేశించింది. అధికారులు జాబితా పంపినా ప్రభుత్వం మాత్రం పెన్షన్ విడుదల చేయడం లేదు. దీంతో కళాకారుల పరిస్థితి దైన్యంగా మారింది.
Advertisement