వర్శిటీల్లో కుల సంఘాలపై ఉక్కుపాదం : గంటా

యూనివర్శిటీల్లో కుల, మత సంఘాలపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంత్రి తిరుపతిలో మాట్లాడుతూ అవసరమైతే వర్శిటీల్లో ఔట్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. బార్‌ కోడింగ్‌తో విద్యార్థులకు ఐడీ కార్డులు ఇస్తామన్నారు. వర్శిటీల్లో బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. బాలికల హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వచ్చే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రైవేటు వర్శిటీల బిల్లును తీసుకువస్తామని మంత్రి గంటా వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు ఓ సారి వీసీలతో […]

Advertisement
Update:2015-07-26 18:41 IST
యూనివర్శిటీల్లో కుల, మత సంఘాలపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంత్రి తిరుపతిలో మాట్లాడుతూ అవసరమైతే వర్శిటీల్లో ఔట్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. బార్‌ కోడింగ్‌తో విద్యార్థులకు ఐడీ కార్డులు ఇస్తామన్నారు. వర్శిటీల్లో బయోమెట్రిక్‌ విధానం ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. బాలికల హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వచ్చే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రైవేటు వర్శిటీల బిల్లును తీసుకువస్తామని మంత్రి గంటా వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు ఓ సారి వీసీలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏఎన్‌యూ విద్యార్థిని రితికేశ్వరి మృతిపై నిజనిర్ధారణ కమిటీని నియమించామన్నారు.
Tags:    
Advertisement

Similar News