తెలంగాణ‌లో కొలువుల జాత‌ర‌!

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీపి క‌బురు అందించారు. గ‌త కొంత‌కాలంగా ఆర్థిక‌శాఖ క్లియ‌రెన్స్ కార‌ణంగా జాప్య‌మ‌వుతూ వ‌స్తున్న ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌ల‌కు ఎట్ట‌కేల‌కు మోక్షం క‌లిగింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొలువుల భర్తీకి ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపారు. తొలి దశలో భాగంగా 15 ప్రభుత్వ శాఖల్లో మొత్తం 15వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విభాగాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం శనివారం సాయంత్రం సంతకం చేశారు.  ఈ […]

Advertisement
Update:2015-07-26 02:48 IST
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీపి క‌బురు అందించారు. గ‌త కొంత‌కాలంగా ఆర్థిక‌శాఖ క్లియ‌రెన్స్ కార‌ణంగా జాప్య‌మ‌వుతూ వ‌స్తున్న ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌ల‌కు ఎట్ట‌కేల‌కు మోక్షం క‌లిగింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొలువుల భర్తీకి ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపారు. తొలి దశలో భాగంగా 15 ప్రభుత్వ శాఖల్లో మొత్తం 15వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విభాగాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై సీఎం శనివారం సాయంత్రం సంతకం చేశారు. ఈ సారి వ‌యోప‌రిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్ల‌కు పెర‌గ‌డం విశేషం.
ఖాళీల వివ‌రాలు!
రోడ్లు భవనాల శాఖ తమ శాఖలో 200 ఖాళీలున్నట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 125 జూనియర్ ఇంజినీర్లు, 75 టెక్నికల్ అసిస్టెంట్లు భర్తీ కావాల్సి ఉందని ఆ శాఖ నివేదికలో పేర్కొంది. తమ శాఖ పరిధిలో 1081 పోస్టుల భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మున్సిపల్ శాఖ సర్కారుకు వివరాలు అందజేసింది. గ్రేడ్-2, గ్రేడ్-3 కమిషనర్, అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్ తదితరాలు 325 ఖాళీలు ఉన్నాయని ప్రతిపాదించారు. రవాణాశాఖలో 36 ఉన్నట్లు ప్రతిపాదనలు పంపారు. ఆరు ఆర్టీవో, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఖాళీలు 30 ఉన్నట్లు సమాచారం.
టౌన్‌ప్లానింగ్ విభాగంలో 241 పోస్టులు, ఇంజినీరింగ్ విభాగంలో 515 ఖాళీలు ఉన్నట్లు శాఖ ప్రతిపాదించింది. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో దాదాపు 4,000, వ్యవసాయ శాఖలోని 1,100 పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. రెవెన్యూ విభాగంలో దాదాపు 6,000 ఖాళీలు గుర్తించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌కి అవసరమైన 418 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 125 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అవకాశం ఉంది.
Tags:    
Advertisement

Similar News