మిషన్ కాకతీయను అభినందించిన హైకోర్టు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టును హైకోర్టు అభినందించింది. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైందని హైకోర్టు న్యాయమూర్తలు జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు, జస్టిస్ బి.శివశంకరరావులతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ముప్పై ఏళ్ల క్రతిమే ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉంటే చెరువులు, కాలువలు కబ్జాలకు గురయ్యేవి కాదని ధర్మాసనం అభిప్రాయ పడింది. రంగారెడ్డి జిల్లాలోని చెరువుల ఆక్రమణలపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో న్యాయమూర్తులు మిషన్ కాకతీయపై అభినందనలు కురిపించారు. భూగర్భ […]
Advertisement
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టును హైకోర్టు అభినందించింది. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం చారిత్రాత్మకమైందని హైకోర్టు న్యాయమూర్తలు జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు, జస్టిస్ బి.శివశంకరరావులతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ముప్పై ఏళ్ల క్రతిమే ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఉంటే చెరువులు, కాలువలు కబ్జాలకు గురయ్యేవి కాదని ధర్మాసనం అభిప్రాయ పడింది. రంగారెడ్డి జిల్లాలోని చెరువుల ఆక్రమణలపై దాఖలైన పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో న్యాయమూర్తులు మిషన్ కాకతీయపై అభినందనలు కురిపించారు. భూగర్భ జలాలు అడుగంటకుండా ఉండాలంటే చెరువులకు జీవకళ తీసుకు రావాలని వారు అభిప్రాయపడ్డారు.
Advertisement