జమ్మూ కాశ్మీర్‌లో కుండపోత వర్షాలు..
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజౌళి జిల్లాలో నాలాలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీనితో ఇళ్లను వదిలి బయట ఉండాల్సిన పరిస్థితి కలుగుతోంది. శనివారం రాత్రంతా ప్రజలు రోడ్లపైనే జాగారం చేశారు. భారీ వర్షాలకు తమ ఇళ్లు కూలిపోయాయని రాజౌళి వాసులు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రాజౌళి గ్రామస్తులు ఆవేదన […]
Advertisement
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాజౌళి జిల్లాలో నాలాలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీనితో ఇళ్లను వదిలి బయట ఉండాల్సిన పరిస్థితి కలుగుతోంది. శనివారం రాత్రంతా ప్రజలు రోడ్లపైనే జాగారం చేశారు. భారీ వర్షాలకు తమ ఇళ్లు కూలిపోయాయని రాజౌళి వాసులు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రాజౌళి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement