చంద్రబాబు వల్లనే ఏపీకి మొండిచెయ్యా..?
‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అంటే ఇదేనేమో? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మిత్రపక్షం జంటగా ఎన్నికలకు వెళ్లాయి. రాష్ట్ర విభజనతో రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఏపీని ఆదుకుంటామని మోదీ హామీలు గుప్పించారు. ప్రత్యేక హోదా కల్పించి అన్నివిధాలా సాయమందిస్తామని భరోసా ఇచ్చారు. తీరా బీజేపీ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించింది. దీంతో టీడీపీని మోదీ లైట్ తీసుకుంటున్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని తాత్కాలికంగా పక్కన బెట్టేశారు. తాజాగా […]
Advertisement
‘ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అంటే ఇదేనేమో? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మిత్రపక్షం జంటగా ఎన్నికలకు వెళ్లాయి. రాష్ట్ర విభజనతో రాజధాని నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఏపీని ఆదుకుంటామని మోదీ హామీలు గుప్పించారు. ప్రత్యేక హోదా కల్పించి అన్నివిధాలా సాయమందిస్తామని భరోసా ఇచ్చారు. తీరా బీజేపీ తిరుగులేని మెజారిటీతో విజయం సాధించింది. దీంతో టీడీపీని మోదీ లైట్ తీసుకుంటున్నారు. ప్రత్యేకహోదా అంశాన్ని తాత్కాలికంగా పక్కన బెట్టేశారు. తాజాగా మోదీ బీహార్‌లో ఎన్నికల సమరశంఖం పూరించారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ ప్రత్యేక ప్యాకేజీని అడగలేదు. కానీ, వారిని నిధుల వరదల హామీలలో ముంచేశారు మోదీ. బీహార్‌కు ఏకంగా రూ.50 వేల కోట్లు సాయం చేస్తామని ప్రకటించారు. రాజధాని నిర్మాణానికి ఏపీలో రూ.వేల కోట్ల రూపాయలు అవసరం. ఇందుకు ప్రత్యేకహోదా కల్పించాల్సిన అవసరముంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్, బీజేపీలు ఈ విషయంలో పోటీపడి హామీలిచ్చాయి. తీరా అధికారంలోకి వచ్చాక మోదీ స్వరం మారింది.ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతపెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తే కేంద్రంపై భారం పడుతుందని, ప్రత్యేకహోదా కల్పిస్తే ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయని మెలికపెట్టి తప్పించుకున్నారు.
చంద్రబాబు భయం అదేనా?
దీనికి చంద్రబాబు వైఖరి కూడా ప్రధాన కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. మోదీకి సభలో కావాల్సినంత మోజారిటీ ఉంది. మరీగట్టిగా అడిగితే.. పొత్తు దెబ్బ తింటుంది. ఉన్న కేంద్రమంత్రి పదవులు కూడా తమ చేతి నుంచి జారి పోతాయి. ఈ భయంతో చంద్రబాబు సరిగా ఒత్తిడి తేలేకపోతున్నారు. తెగేదాకా లాగడమెందుకు అని వెంకయ్య ద్వారా లాబీయింగ్ చేయిస్తున్నా అవి కొలిక్కి రావడం లేదు. దీనికితోడు ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే కేంద్రం సాయం కోరుతున్న కేసులో సంగతి తెలిసిందే! ఇన్ని ప్రతికూలతల మధ్య ప్రత్యేకహోదాను బీజేపీ కాదు, టీడీపీనే పక్కన బెట్టినట్లుందని ఏపీలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాకపోతే.. కంటితుడుపు చర్యగా పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ప్లకార్డుల ప్రదర్శన చేస్తున్నారని విమర్శిస్తున్నాయి. ఇప్పడు బీహార్‌లో ఎలాగైనా అధికారపీఠం దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ వారు అడగకున్నా రూ.50 వేల కోట్లు ఇస్తామని ఉచిత హామీలు ఇస్తోంది. ఇదేం విచిత్రమో? మరి బీహార్‌కు ప్రకటించినపుడు, ఏపీకి ఎందుకు ప్రకటించరని ఏపీ టీడీపీ నేతలు బీజేపీని నిలదీస్తారా? చూద్దాంమరి!
Advertisement