వెంకయ్యా.. గద్దె దిగు!

ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేసిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి విద్యార్థి జెఎసి ఆయన నివాసం ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెఎసి నాయకులు బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్నుద్దేశించే ఎపి విద్యార్థి జెఎసి చైర్మన్‌ ఎల్‌.గోవిందరావు మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హౌదాపై కేంద్రాన్ని నిలదీయకుండా వెంకయ్యనాయుడు ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నాడు బిజెపి తరపున […]

Advertisement
Update:2015-07-25 18:49 IST
ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేసిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎపి విద్యార్థి జెఎసి ఆయన నివాసం ఎదుట ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెఎసి నాయకులు బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాన్నుద్దేశించే ఎపి విద్యార్థి జెఎసి చైర్మన్‌ ఎల్‌.గోవిందరావు మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హౌదాపై కేంద్రాన్ని నిలదీయకుండా వెంకయ్యనాయుడు ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నాడు బిజెపి తరపున పదేళ్ల ప్రత్యేక హౌదా అడిగిన వెంకయ్య ఇప్పుడు కనబడకుండా దాక్కొంటున్నారని విమర్శించారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనైనా ప్రత్యేక హౌదా ప్రకటించాలని…లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.
Tags:    
Advertisement

Similar News