పుష్కర జల్లులతో పునీతులైన ఖైదీలు
రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూత వేటు దూరంలో పుష్కర గోదావరి. మానసికంగా అలసిపోయిన ఖైదీలకు కూడా పుణ్య గోదారిలో స్నానమాచరించి పునీతులవ్వాలనుకున్నారు. తమకూ పుష్కర గోదారిలో స్నానం చేసే భాగ్యం కల్పించమని జైలు అధికారులను అర్దించారు… ప్రాధేయపడ్డారు. వాస్తవానికి 144 ఏళ్లకొకసారి వచ్చే మహాపుష్కరాలలో భాగంగా తమకు పుష్కర స్నాన భాగ్యం కల్పించాలని 500 మంది మహిళలతో సహా మొత్తం 1,570 మంది ఖైదీలు సంబంధిత అధికారులతో విన్నవించుకున్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే భద్రతా […]
Advertisement
రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూత వేటు దూరంలో పుష్కర గోదావరి. మానసికంగా అలసిపోయిన ఖైదీలకు కూడా పుణ్య గోదారిలో స్నానమాచరించి పునీతులవ్వాలనుకున్నారు. తమకూ పుష్కర గోదారిలో స్నానం చేసే భాగ్యం కల్పించమని జైలు అధికారులను అర్దించారు… ప్రాధేయపడ్డారు. వాస్తవానికి 144 ఏళ్లకొకసారి వచ్చే మహాపుష్కరాలలో భాగంగా తమకు పుష్కర స్నాన భాగ్యం కల్పించాలని 500 మంది మహిళలతో సహా మొత్తం 1,570 మంది ఖైదీలు సంబంధిత అధికారులతో విన్నవించుకున్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వం ఇందుకు నిరాకరించింది. దాంతో ఇలా చేయడం చట్ట విరుద్ధమని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వచ్చే పుష్కరాలు చూస్తామో లేదోనని కొందరు… ఇవి మహా పుష్కరాలంటున్నారు… మళ్ళీ తర్వాత వచ్చే ఇలాంటి పుష్కరాలు చూసే అవకాశం మాకుండదంటూ మరికొందరు… ఇలా రకరకాల కారణాలు చూపించి కనికరించమన్నారు. కాని అధికారులు తమకున్న పరిధి దృష్ట్యా సాధ్యం కాదని చెప్పారు. కనీసం గోదావరి నీళ్ళయినా తమకు తెప్పించాలని విన్నవించారు. జైలు అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశారు. దాంతో రాజమండ్రి జైలు ఖైదీలు పుష్కర జల్లులతో పునీతులయ్యారు. అహోబిల మఠం స్వాములు గోదావరి పవిత్ర జలాలను ఖైదీలపై చల్లి వారిని పునీతులను చేశారు. పనిలోపనిగా రాజమండ్రి సెంట్రల్ జైలు, ఆవరణలో కూడా గోదావరి నది నీటిని చల్లి శుద్ధి చేశారు స్వాములు!
Advertisement