రఘు వీరుడే!
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మరోసారి తన నాయకత్వ పటిమను చాటుకున్నారు. ఏపీలో ప్రాణాలు పోయిన పార్టీ కేడర్‌కు ఊపిరిలూదే యత్నంలో విజయం సాధించారు. రాష్ట్ర విభజన కారణంగా ఏడాదిన్నరగా ఏపీలో కాంగ్రెస్‌కు సరైన ప్రాతినిధ్యం లేదు. అసలు ఆ పార్టీ పేరు చెబితేనే జనాలు కొట్టేంత కోపంతో ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చేపట్టిన రఘువీరా తనదైన శైలిలో ముందుకుపోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఓటుకు నోటు కుంభకోణం, ఇసుక క్వారీల అక్రమ తవ్వకాలు, […]
Advertisement
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మరోసారి తన నాయకత్వ పటిమను చాటుకున్నారు. ఏపీలో ప్రాణాలు పోయిన పార్టీ కేడర్‌కు ఊపిరిలూదే యత్నంలో విజయం సాధించారు. రాష్ట్ర విభజన కారణంగా ఏడాదిన్నరగా ఏపీలో కాంగ్రెస్‌కు సరైన ప్రాతినిధ్యం లేదు. అసలు ఆ పార్టీ పేరు చెబితేనే జనాలు కొట్టేంత కోపంతో ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చేపట్టిన రఘువీరా తనదైన శైలిలో ముందుకుపోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఓటుకు నోటు కుంభకోణం, ఇసుక క్వారీల అక్రమ తవ్వకాలు, రాజధాని ప్రాంతంలో భూసేకరణ, రైతుల ఆత్మహత్యలు ఇలా కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వ వైఫల్యాలను వరుసబెట్టి ఎండగట్టడంలో లీడర్‌గా సఫలీకృతుడవుతున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్లంతా ఇతర పార్టీలకు వలసపోయారు. ఏడాది క్రితం అసలు తాము కాంగ్రెస్ కార్యకర్తమని చెప్పుకునే ధైర్యం ఎవరూ చేయలేదు. తాజాగా ఏపీలో రాహుల్ గాంధీ పర్యటించేలా చేసి పార్టీలో జవజీవాలు నింపే యత్నం చేశారు. ఇతర పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా రాహుల్ పర్యటనను రఘువీరా విజయవంతం చేశారు. ఇటీవల రఘువీరా పార్టీని ముందుకునడిపిస్తున్న తీరును అధిష్ఠానం కూడా మెచ్చుకున్న విషయం తెలిసిందే. మొత్తానికి రాహుల్ టూర్ సక్సెస్‌తో మిణుకుమిణుకు మంటున్న ఏపీలో కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రకాశవంతం చేశాడని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement