మెమెన్ ముస్లిం కాబట్టే ఉరి: అసద్
ఏఐఎమ్ ఐఎమ్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, యాకూబ్ మెమెన్ ముస్లిం కావడం వల్లే ఉరి తీస్తున్నారని ఆరోపించారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబైలో, గుజరాత్ లో మతఘర్షణలు వంటి తీవ్రమైన కేసుల్లో నేరస్తులకు ఈ తరహా శిక్షలు విధించలేదేమని ప్రశ్నించారు. “బాబ్రీ మసీదును కూల్చివేసిన వారిని ఇప్పటి వరకు ఎందుకు శిక్షించలేదు ? వారికి కూడా ఉరిశిక్ష విధించాలి. 1992 93లో ముంబైలో జరిగిన మత కల్లోలాల్లో వేయిమంది ఊచకోతకు గురయ్యారు.ఆ ఘటనలో […]
Advertisement
ఏఐఎమ్ ఐఎమ్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, యాకూబ్ మెమెన్ ముస్లిం కావడం వల్లే ఉరి తీస్తున్నారని ఆరోపించారు. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత, ముంబైలో, గుజరాత్ లో మతఘర్షణలు వంటి తీవ్రమైన కేసుల్లో నేరస్తులకు ఈ తరహా శిక్షలు విధించలేదేమని ప్రశ్నించారు. “బాబ్రీ మసీదును కూల్చివేసిన వారిని ఇప్పటి వరకు ఎందుకు శిక్షించలేదు ? వారికి కూడా ఉరిశిక్ష విధించాలి. 1992 93లో ముంబైలో జరిగిన మత కల్లోలాల్లో వేయిమంది ఊచకోతకు గురయ్యారు.ఆ ఘటనలో ఎంతమందిని శిక్షించారు. మాలెగావ్ పెలుళ్ళతో సంబంధమున్న సాధ్వీప్రజ్ఞ, స్వామీ అసీమానంద్ లకు ఉరిశిక్ష విధించగలరా ? అని ఆయన ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ, బియాంత్ సింగ్ హత్య కేసుల్లో మరణ దండన విధించిన నిందితులకు కూడా ఇదే తరహా నిబంధనలు అమలు చేయాలని ఓవైసీ సూచించారు. రాజీవ్ హత్య కేసులో నిందితులకు రాజకీయ బలం, అండదండలు ఉన్నాయి. అందుకే వారి కోసం తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేయించగలిగింది. మెమెన్‌కు అలాంటి బలాబలాలు లేనందునే ఉరితీస్తున్నారని ఒవైసీ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ ఎంపీ అసద్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ సంకుచిత ధోరణికి నిదర్శనమని ఎగతాళి చేశారు. ప్రతివిషయాన్ని మతం కోణంలో చూడటం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. తాను అసలు ఎమ్ ఐఎమ్‌ను అసలు రాజకీయ పార్టీగానే గుర్తించడం లేదని స్పష్టం చేశారు. 1993లో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 13 చోట్ల బాంబు పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఇంతటి మారణహోమానికి పాల్పడిన అసలు సూత్రధారి దావూద్ ఇబ్రహీం దేశం దాటి పారిపోయాడు. పోలీసులకు చిక్కిన మెమెన్‌కు టాడా కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ నెలాఖరున మెమెన్‌ను ఉరితీసేందుకు మహారాష్ర్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సందర్భంలో దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ మెమెన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఎంపీ అసద్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారని బిజేపి నేతలంటున్నారు.
Advertisement