వర్సిటీల బోధనేతర సిబ్బందికి పదో పీఆర్సీ

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి కూడా పదో పీఆర్సీని వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి 43 శాతం ఫిట్‌మెంట్‌తో పదో పీఆర్సీ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేస్తున్న రివైజ్‌డ్ పే స్కేల్స్-2015 నిబంధనలన్నింటినీ జవహర్‌లాల్ విశ్వవిద్యాలయం సహా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్-టీచింగ్ ఉద్యోగులందరికీ వర్తింపజేస్తారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన […]

Advertisement
Update:2015-07-23 18:40 IST
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి కూడా పదో పీఆర్సీని వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి 43 శాతం ఫిట్‌మెంట్‌తో పదో పీఆర్సీ నిబంధనల ప్రకారం వేతనాలు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింప చేస్తున్న రివైజ్‌డ్ పే స్కేల్స్-2015 నిబంధనలన్నింటినీ జవహర్‌లాల్ విశ్వవిద్యాలయం సహా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్-టీచింగ్ ఉద్యోగులందరికీ వర్తింపజేస్తారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మార్గదర్శకాలన్నీ విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బందికి వర్తిస్తాయని, సంబంధిత విశ్వవిద్యాయాల రిజిస్ట్రార్లు బోధనేతర సిబ్బందికి నూతన పే స్కేల్ ప్రకారం వేతనాలను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Tags:    
Advertisement

Similar News