రిషికేశ్వరి ఆత్మహత్య వెనుక అనేక నిజాలు!
ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో రిషికేశ్వరి ఆత్మహత్య వెనుక దాగిన నిజాలన్నీ క్రమంగా బయటపడుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు జరిపే కొద్ది ర్యాగింగ్‌కు సంబంధించిన దారుణమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న ముందురోజు రిషికేశ్వరిని సీనియర్ విద్యార్థులు తీవ్రంగా వేధించారని, అర్ధనగ్నంగా హాస్టల్ గదిలో నడిపించి… దాన్ని సెల్‌లో చిత్రీకరించారని వెల్లడయింది.. తర్వాత ఆ వీడియోను ఇతరులకు షేర్ చేశారని, తమతో సన్నిహితంగా ఉండకపోతే ఈ వీడియోలు బయటపెట్టి పరువు తీస్తామని సీనియర్లు బెదిరించినట్లుగా తెలిసింది. ఈ […]
Advertisement
ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో రిషికేశ్వరి ఆత్మహత్య వెనుక దాగిన నిజాలన్నీ క్రమంగా బయటపడుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు జరిపే కొద్ది ర్యాగింగ్‌కు సంబంధించిన దారుణమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆత్మహత్య చేసుకున్న ముందురోజు రిషికేశ్వరిని సీనియర్ విద్యార్థులు తీవ్రంగా వేధించారని, అర్ధనగ్నంగా హాస్టల్ గదిలో నడిపించి… దాన్ని సెల్‌లో చిత్రీకరించారని వెల్లడయింది.. తర్వాత ఆ వీడియోను ఇతరులకు షేర్ చేశారని, తమతో సన్నిహితంగా ఉండకపోతే ఈ వీడియోలు బయటపెట్టి పరువు తీస్తామని సీనియర్లు బెదిరించినట్లుగా తెలిసింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అనిషా, శ్రీనివాస్ అనే సీనియర్ విద్యార్థులతోపాటు శ్రీచరన్ అనే లెక్చరర్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రుషికేశ్వరి మృతి కేసులో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థినులతో ప్రిన్సిపాల్ బాబూరావు అసభ్యకర ప్రవర్తనను విద్యార్థినులు ఫోన్‌లో చిత్రీకరించి విచారణ కమిటీకి అందజేశారు. ఈ వీడియోను చూసిన కమిటీ సభ్యులు ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలని సూచించినట్టు తెలిసింది. పైగా ఈ ప్రిన్సిపాల్‌కు రిషికేశ్వరి తండ్రి గతంలో తన కుమార్తెపై ర్యాగింగ్ జరుగుతున్న విషయాన్ని ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన సరిగా స్పందించనట్టు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారాల నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేయడమొక్కటే అధికారులకు సరైన చర్యగా భావించి చర్య తీసుకున్నారు.
Advertisement