వారంలోగా ఉస్మానియా తరలింపు?
కోట్లాదిమందికి తన ఒడిలో చేర్చుకుని నయాపైసా తీసుకోకుండా చికిత్స నందించిన చారిత్రక ఆసుపత్రిలో ఒక విభాగం ఇక వీడుకోలు తీసుకోనుంది. భవనం పటిష్టతపై ఇంజినీర్లు అనుమానం వ్యక్తం చేయడంతో సీఎం కేసీఆర్ దాన్ని పడగొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియాలోని ఆ భవన స్థానంలో మరో కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 110 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలమై పోయిందని, రోగులు, వైద్యుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన […]
Advertisement
కోట్లాదిమందికి తన ఒడిలో చేర్చుకుని నయాపైసా తీసుకోకుండా చికిత్స నందించిన చారిత్రక ఆసుపత్రిలో ఒక విభాగం ఇక వీడుకోలు తీసుకోనుంది. భవనం పటిష్టతపై ఇంజినీర్లు అనుమానం వ్యక్తం చేయడంతో సీఎం కేసీఆర్ దాన్ని పడగొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియాలోని ఆ భవన స్థానంలో మరో కొత్త భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 110 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలమై పోయిందని, రోగులు, వైద్యుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన ఆయన వ్యక్తంచేశారు. ఈ భవనం ఇక నిలువదని జేఎన్టీయూ ఇంజినీర్లు కూడా చెప్పారని తెలిపారు. అందువల్ల దీన్ని తొలగించి, ఇదే స్థలంలో నూతన భవనం నిర్మిస్తామని అన్నారు. హెరిటేజ్ అంటూ ప్రాణాలను బలిపెట్టలేమని కేసీఆర్ స్పష్టంచేశారు. భవనం శిథిలమై గదుల్లో పై పెచ్చులు ఊడిపడుతుండటంతో జనరల్ మెడిసిన్ డాక్టర్లు, పేషెంట్లు ఆందోళన చెందుతున్నారన్న వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం ఉస్మానియా దవాఖానను సందర్శించారు. అక్కడి భవనాలను స్వయంగా పరిశీలించారు. డాక్టర్లు, రోగులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హాస్పిటల్ బిల్డింగ్ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని అన్నారు. పేషెంట్లు, వైద్యుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని వారంలో దవాఖానను అనువైన ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. ఇతర వైద్యశాలలతోపాటు అవసరాన్ని బట్టి ప్రైవేటు భవనాల్లోకి కూడా కొన్ని విభాగాలను తరలిస్తామన్నారు.
Advertisement