పాక్ ప్రధానికి అమెరికా ఆహ్వానం
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌ను అమెరికాలో పర్యటించాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా ఆహ్వానించారు. ఈ విషయాన్ని పాక్ ప్రధాని కార్యాలయ అధికారి మీడియాకు వెల్లడించారు. పాక్ ప్రధాని అక్టోబరులో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా ఖండంలోని భారత్‌తోసహా ఇరుగు పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకోవాలనే పాక్ ప్రధాని ఆశయాన్ని అమెరికా గుర్తించిందని, అందువల్లనే ఆయనును అమెరికాకు ఆహ్వానించి ఉంటుందని దౌత్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు ఒబామా ఆహ్వానాన్ని పాక్ […]
Advertisement
పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌ను అమెరికాలో పర్యటించాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా ఆహ్వానించారు. ఈ విషయాన్ని పాక్ ప్రధాని కార్యాలయ అధికారి మీడియాకు వెల్లడించారు. పాక్ ప్రధాని అక్టోబరులో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. ఆసియా ఖండంలోని భారత్‌తోసహా ఇరుగు పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పర్చుకోవాలనే పాక్ ప్రధాని ఆశయాన్ని అమెరికా గుర్తించిందని, అందువల్లనే ఆయనును అమెరికాకు ఆహ్వానించి ఉంటుందని దౌత్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాదు ఒబామా ఆహ్వానాన్ని పాక్ ప్రధాని చర్యలకు మద్దతుగా భావించాలని కూడా వారు అంటున్నారు. పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నవాజ్ షరీఫ్ ఇరుగు పొరుగు దేశాలతో శాంతి సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత్‌తో సహా పలు దేశాలతో సంబంధాలను మెరుగు పర్చుకుంటున్నారు. అయితే, నవాజ్ ప్రయత్నాలు పాక్ సైన్యానికి కంటగింపుగా మారాయి. సైన్యం నుంచి తీవ్ర ఒత్తిడి ఎదురైనా షరీఫ్ తన విధానాలు మార్చుకోవడం లేదు. షరీఫ్ ప్రయత్నాలను ఒబామా గుర్తించినందునే అమెరికాలో పర్యటించాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించారని దౌత్య నిపుణులు భావిస్తున్నారు.
Advertisement