మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉధృతం
మున్సిపల్ కార్మికుల వేతనం పెంచాలని కోరుతూ చేపట్టిన సమ్మెను కార్మికులు ఉధృతం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలన్నీ కార్మికుల నిరసనలు, ధర్నాలు,దిష్టిబొమ్మల దహనాలతో అట్టుడుకుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం ప్రతి జిల్లా కార్యాలయం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేసేందుకు ప్రయత్నించారు. మున్సిపాలిటీ కార్యాలయాల ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించడంతో పాటు పలు జిల్లాల్లో కార్మికులు భిక్షాటన చేశారు. న్యాయం చేయాలని కోరుతూ అధికార పార్టీ నేతల ఇళ్లను ముట్టడించారు. కనీస వేతనం […]
Advertisement
మున్సిపల్ కార్మికుల వేతనం పెంచాలని కోరుతూ చేపట్టిన సమ్మెను కార్మికులు ఉధృతం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాలన్నీ కార్మికుల నిరసనలు, ధర్నాలు,దిష్టిబొమ్మల దహనాలతో అట్టుడుకుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం ప్రతి జిల్లా కార్యాలయం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేసేందుకు ప్రయత్నించారు. మున్సిపాలిటీ కార్యాలయాల ఎదుట వంటావార్పు కార్యక్రమం నిర్వహించడంతో పాటు పలు జిల్లాల్లో కార్మికులు భిక్షాటన చేశారు. న్యాయం చేయాలని కోరుతూ అధికార పార్టీ నేతల ఇళ్లను ముట్టడించారు. కనీస వేతనం ఇప్పించాలని మోకాళ్లపై నడుస్తూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొండాసురేఖ ఇంటిని ముట్టడించినప్పుడు కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కరీంనగర్‌లో కార్మికులు చేస్తున్న దీక్షలకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మద్దతు ప్రకటించారు.
Advertisement