'అనర్హత’ కేసులో స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు
ఎమ్మెల్యేల అనర్హతపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలంటూ హైకోర్టులో దాఖలైన అప్పీళ్లపై ధర్మాసనం శాసనసభ స్పీకర్‌కు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను పిటిషనర్ల తరఫు న్యాయవాది స్వయంగా ఇచ్చేందుకు (పర్సనల్) వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భోసాలే, జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యాజ్యాల విచారణను రెండు వారాలకు వాయిదా వేసి… ఆ రోజు తుది విచారణ చేస్తామని స్పష్టం […]
Advertisement
ఎమ్మెల్యేల అనర్హతపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలంటూ హైకోర్టులో దాఖలైన అప్పీళ్లపై ధర్మాసనం శాసనసభ స్పీకర్‌కు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులను పిటిషనర్ల తరఫు న్యాయవాది స్వయంగా ఇచ్చేందుకు (పర్సనల్) వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భోసాలే, జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యాజ్యాల విచారణను రెండు వారాలకు వాయిదా వేసి… ఆ రోజు తుది విచారణ చేస్తామని స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి తలసాని శ్రీనివాస యాదవ్, తీగల క్రిష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి… కాంగ్రెస్ పార్టీ నుంచి డీఎస్ రెడ్యానాయక్, కాలే యాదయ్య, కోరం కనకయ్య, జి. విఠల్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌లు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. వీరిపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ శాసనసభ స్పీకర్‌కు ఇచ్చిన ఫిర్యాదులపై సత్వర విచారణ జరపాలని ఆదేశించాలని టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలకు చెందిన నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సంపత్ కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా హైకోర్టును కోరారు. వీటిని విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి… స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న వ్యాజ్యాల్లో జోక్యం చేసుకోడానికి నిరాకరించింది. సింగిల్ జడ్జి ఆదేశాలపై పిటిషనర్లు డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేశారు. ఈ పిటిషన్లపై గురువారం జరిగిన విచారణ ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
Advertisement