రైతు కుటుంబాలకు పరిహారంపై న్యాయపోరాటం
భరోసా యాత్రలో రైతు కుటుంబాలకు జగన్ హామీ తాను అండగా ఉంటానని, ఎవ్వరూ అధైర్య పడొద్దని వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. బుధవారం అనంత పురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆత్మహత్యకు పాల్పడిన ముగ్గురు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. కళ్యాణదుర్గంలోని నూత న వైఎస్‌ఆర్ పార్టీ కార్యాలయం భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అనంతరం అక్కడ వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొబ్బర్లపల్లి గ్రామంలో రైతు […]
Advertisement
భరోసా యాత్రలో రైతు కుటుంబాలకు జగన్ హామీ
తాను అండగా ఉంటానని, ఎవ్వరూ అధైర్య పడొద్దని వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. బుధవారం అనంత పురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆత్మహత్యకు పాల్పడిన ముగ్గురు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. కళ్యాణదుర్గంలోని నూత న వైఎస్‌ఆర్ పార్టీ కార్యాలయం భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. అనంతరం అక్కడ వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొబ్బర్లపల్లి గ్రామంలో రైతు ఈరన్న కుటుంబాన్ని, ముదిగల్లు గ్రామంలోని రైతు నారాయణప్ప కుటుంబాన్ని, వర్లి గ్రామానికి చెందిన రైతు గంగన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడుతారని విమర్శించారు. బకాయిలు చెల్లించొద్దని ఆయన చెప్పిన మాటలు విని రైతులు రుణాలు చెల్లించలేదన్నారు. దీంతో రుణాలు రెన్యూవల్ కాలేదన్నారు. రైతులు ఇన్సూరెన్స్‌ను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల తరపున కోర్టుల్లో పోరాడతాం
రుణమాఫీ కాక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నా రైతు ఆత్మహత్య కాదని ఆఫీసర్లు బెదిరిస్తున్నారని కొందరు రైతుల కుటుంబాలు జగన్‌మోహన్ రెడ్డికి వివరించాయి. డీఎస్పీ, ఆర్డీవో విచారణకు వచ్చారని, రైతు ఆత్మహత్య కాదని, ఇతర కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని మమ్మల్ని బెదిరిస్తూ మాట్లాడుతున్నారంటూ వర్లి గ్రామానికి చెందిన రామాంజమ్మ జగన్‌కు చెప్పుకుని బోరుమన్నారు. నిజమైన రైతు ఆత్మహత్యలను కూడా ప్రభుత్వం గుర్తించడం లేదని, అలాంటి వారి వివరాలను సేకరించి కోర్టుల్లో కేసులు వేస్తామని జగన్ ప్రకటించారు. ఆ కేసులలో గట్టిగా పోరాడి పరిహారం వచ్చేలా చూస్తామని చెప్పారు. ప్రభుత్వం పరిహారం ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతు కుటుంబాల వివరాలను సేకరించాలని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డికి సూచించారు. ఐదు లక్షల పరిహారం ప్రకటించి మూడు లక్షలే ఇచ్చారని ముదిగల్లులో నారాయణప్ప కుటుంబ సభ్యులు జగన్‌కు వివరించారు.
Advertisement