చెత్త డబ్బాలకు రూ.42 కోట్లు?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరో కొత్త పథకం సిద్ధం చేసింది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛహైదరాబాద్‌తో చెత్త సమస్య ఎంతగా ఉందో గుర్తించారు సీఎం కేసీఆర్.. పారిశుధ్య కార్మికుల సమ్మె..భవిష్యత్‌లో చెత్త వల్ల మహానగరం ఎదుర్కొనే ఇబ్బందులను ప్రభుత్వాన్ని మేల్కొలిపేలా చేసింది. దీంతో ఇంటికో చెత్తబుట్టను అందించేలా ప్లాన్ చేశారు. చెత్త సేకరణకు కొత్త పద్ధతిని జీహెచ్ఎంసీలో ప్రవేశపెట్టనున్నారు. కొద్ది రోజుల్లో ప్రతి ఇంటికి రెండు చెత్త డబ్బాలను జీహెచ్‌ఎంసీ ఉచితంగా అందించనుంది. స్వచ్ఛ హైదరాబాద్‌లో […]
Advertisement
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరో కొత్త పథకం సిద్ధం చేసింది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛహైదరాబాద్‌తో చెత్త సమస్య ఎంతగా ఉందో గుర్తించారు సీఎం కేసీఆర్.. పారిశుధ్య కార్మికుల సమ్మె..భవిష్యత్‌లో చెత్త వల్ల మహానగరం ఎదుర్కొనే ఇబ్బందులను ప్రభుత్వాన్ని మేల్కొలిపేలా చేసింది. దీంతో ఇంటికో చెత్తబుట్టను అందించేలా ప్లాన్ చేశారు. చెత్త సేకరణకు కొత్త పద్ధతిని జీహెచ్ఎంసీలో ప్రవేశపెట్టనున్నారు. కొద్ది రోజుల్లో ప్రతి ఇంటికి రెండు చెత్త డబ్బాలను జీహెచ్‌ఎంసీ ఉచితంగా అందించనుంది. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి కుటుంబానికీ వేర్వేరుగా తడి, పొడి చెత్త సేకరణకు డస్ట్‌బిన్‌లు ఇవ్వనున్నారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం గ్రేటర్‌లో 40లక్షల బిన్‌లు అవసరమని అంచనా వేసిన అధికారులు, ఇతర అవసరాలకు మరో 12.5శాతం అదనంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. మొత్తం 44,04,568 డబ్బాలకు రూ.41,40,29,392 అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు డస్ట్‌బిన్ల కొనుగోలు కోసం టెండర్లు పిలిచేందుకు పాలనాపరమైన అనుమతులిస్తూ పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ- ప్రొక్యూర్‌మెంట్‌లో టెండర్లు పిలిచి త్వరలో డస్ట్‌బిన్లు సమకూర్చుకోవాలని జీహెచ్‌ఎంసీని ఆదేశాలు అందాయి. తడి, పొడి చెత్తను సేకరణ దశలోనే వేరు చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు 2000 సంవత్సరంలో ఆదేశించినా.. ఇది అమలు కావడం లేదు. దీంతో ఇంటి నుంచే చెత్తను వేరు చేయాలని నిర్ణయించారు. తడి చెత్తకు ఒకటి, పొడి చెత్తకు ఒకటి చొప్పున రెండు డబ్బాలు ఇస్తారు. వీటిలో ఆకుపచ్చ రంగు డబ్బాలో ఆహా ర, ఇతర బయో డిగ్రేడబుల్ వ్యర్థాలు, నీ లం రంగు బిన్‌లో ప్లాస్టిక్ వంటి రీసైక్లబుల్ వ్యర్థాలు వేయాల్సి ఉంటుంది. చెత్త సేకరించే సిబ్బందికి కూడా దీనిపై అవగాహన కల్పించనున్నారు.
Advertisement