చిరంజీవి క్రతువు అసంపూర్తిగా ముగించారా?
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సినీ హీరో చిరంజీవి పుష్కర స్నానం, తీర్థ విధులు వివాదాస్పదంగా మారాయి. పుష్కర స్నానం చేసిన తర్వాత తన పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఆ తంతును అసంపూర్తిగా వదిలేశారన్న వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో బుధవారం బావమరిది అల్లు అరవింద్, దర్శకుడు బి.గోపాల్, మేనల్లుడు అల్లు శిరీష్‌తో కలసి చిరంజీవి పుష్కర స్నానం చేశారు. ఆయన రాక సందర్భంగా అక్కడ భారీగానే పోలీసు బందోబస్తు […]
Advertisement
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సినీ హీరో చిరంజీవి పుష్కర స్నానం, తీర్థ విధులు వివాదాస్పదంగా మారాయి. పుష్కర స్నానం చేసిన తర్వాత తన పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఆ తంతును అసంపూర్తిగా వదిలేశారన్న వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో బుధవారం బావమరిది అల్లు అరవింద్, దర్శకుడు బి.గోపాల్, మేనల్లుడు అల్లు శిరీష్‌తో కలసి చిరంజీవి పుష్కర స్నానం చేశారు. ఆయన రాక సందర్భంగా అక్కడ భారీగానే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘాట్‌లో పిండప్రదానానికి ఏర్పాట్లు చేశారు. స్నానానంతరం చిరంజీవి తదితరులు పిండప్రదాన క్రతువు ప్రారంభించారు. అయితే ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆ తంతు ముగించేశారు. ఈలోగా అభిమానులు, యాత్రికులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో క్రతువు ముగిసిన వెంటనే చిరంజీవి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. పిండాలను గోదావరిలో కలపకుండా మెట్లపైనే వదిలి వెళ్లిపోవడంతో అభిమానులు, యాత్రికులతో పాటు పురోహితులు కూడా విస్తుపోయారు. దాంతో తేరుకున్న అభిమానులు పారిశుధ్య కార్మికులతో చిరంజీవి వదిలేసిన పిండాలను ఎత్తించి చెత్త కుండీలో వేయించారు. పిండాలను గోదావరిలో కలపకపోతే క్రతువు పూర్తి చేసినట్లు కాదని పురోహితులు అన్నారు.
Advertisement