జీహెచ్ఎంసీ లెక్కల మాయ... 13.88 లక్షల ఓట్లు మాయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తమ మాయ లెక్కలతో నగరంలోని 13.88 లక్షల మంది ఓటర్లను మాయం చేశారు. ఆర్నెల్లుగా వీరు నగరంలో లేరని బుకాయిస్తున్నారు. ఆరు నెలలుగా హైదరాబాద్‌లో పత్తా లేకుండా పోయిన వారి లిస్టులో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్, ఏపీ ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీలు కూడా ఉన్నారు. అపార్టమెంటుల్లో అయితే వందలాది కుటుంబాలే మాయమయ్యాయి. జీహెచ్ఎంసీ మాయాజాలం చూసి నగర ఓటర్లు మండిపడుతున్నారు. బూత్‌లెవల్ అధికారులు ఇష్టారాజ్యంగా ఇంటింటి […]
Advertisement
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తమ మాయ లెక్కలతో నగరంలోని 13.88 లక్షల మంది ఓటర్లను మాయం చేశారు. ఆర్నెల్లుగా వీరు నగరంలో లేరని బుకాయిస్తున్నారు. ఆరు నెలలుగా హైదరాబాద్‌లో పత్తా లేకుండా పోయిన వారి లిస్టులో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్, ఏపీ ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీలు కూడా ఉన్నారు. అపార్టమెంటుల్లో అయితే వందలాది కుటుంబాలే మాయమయ్యాయి. జీహెచ్ఎంసీ మాయాజాలం చూసి నగర ఓటర్లు మండిపడుతున్నారు. బూత్‌లెవల్ అధికారులు ఇష్టారాజ్యంగా ఇంటింటి సర్వేను నిర్వహించారని, అధికారులు ఎవరూ క్షేత్రస్థాయి పరిశీలన జరపలేదని వారు ఆరోపించారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణా లోపం వల్లనే ఈ దుస్థితి దాపురించిందిని, అధికారులు ఇప్పటికైనా మేల్కొని ఓటర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Advertisement