సింగపూర్ మాస్టర్‌ప్లాన్‌కు లక్షకోట్లా?
వైఎస్ఆర్‌సీపీ అధికారప్రతినిధి రోజా ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సింగపూర్‌కు లక్ష కోట్లు నజరానా ఇచ్చిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మాస్టర్‌ప్లాన్ గీసి ఇచ్చినందుకు గాను సింగపూర్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదివేల ఎకరాలను ధారాదత్తం చేయబోతోందని ఆమె ఆరోపించారు. వాటి విలువ లక్షకోట్లకు పైమాటేనని రోజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయడానికి […]
Advertisement
వైఎస్ఆర్‌సీపీ అధికారప్రతినిధి రోజా ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సింగపూర్‌కు లక్ష కోట్లు నజరానా ఇచ్చిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మాస్టర్‌ప్లాన్ గీసి ఇచ్చినందుకు గాను సింగపూర్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదివేల ఎకరాలను ధారాదత్తం చేయబోతోందని ఆమె ఆరోపించారు. వాటి విలువ లక్షకోట్లకు పైమాటేనని రోజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేయడానికి సింగపూరేమైనా దార్మిక సంస్ధా అని ప్రశ్నించారు. మాస్లర్ ప్లాన్‌ను ఫ్రీగా ఇవ్వడానికి సింగపూర్ తెలుగుదేశం పార్టీ నేతలకు సింగపూర్ మేనమామనా అని మండిపడ్డారు. సింగపూర్ పెద్ద బిజినెస్ దేశమని, మాస్టర్ ప్లాన్‌ను ఎందుకు ప్రీగా ఇస్తుందని అన్నారు. మాస్టర్ ప్లాన్ కోసం చంద్రబాబు నాయుడు సింగపూర్ కంపెనీకి 10వేల ఎకరాలను ఇవ్వబోతున్నారని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఆమె మీడియాకు చూపించారు. ప్రపంచ దేశాల్లో బారతీయులు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటే..రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌కు అప్పగించి తెలుగువారిని అవమానించారని మండిపడ్డారు. రాయపూర్‌ను మన భారతీయులు నిర్మించలేదా అని ఆమె ప్రశ్నించారు. ఏపి రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదా..? లేక సింగపూర్ ప్రభుత్వానిదా ఆమె ప్రశ్నించారు. బడ్జెట్‌లో కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా రాజధాని ఎలా కడతారని రోజా నిలదీశారు. అసలు ఇందులో కేంద్ర ప్రభుత్వం గురించిన ప్రస్తావన లేనేలేదని ఆమె పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ చూస్తుంటే మగధీర, బాహుబలి సినిమా ట్రైలర్లు చూసిన ట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అది మాస్టర్ ప్లాన్ కాదని, చంద్రబాబు నాయుడు డైవర్షన్ ప్లాన్ అని ఎద్దేవా చేశారు. ప్లాన్‌లో రైతులు, బడుగు లకు స్థానం ఎక్కడుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒక సమస్య నుంచి బైటపడడం కోసం మరో ప్లాన్ వేయడం, అది విఫలమైతే ఇంకో వ్యూహం పన్నడం చంద్రబాబు కు అలవాటని అన్నారు. ఓటుకు కోట్లు కుంభకోణం బయటపడితే దాన్నుంచి జనం దృష్టిని మరల్చడానికి గాను గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని, విదేశీ మీడియా సాయంతో ప్రచార చిత్రాలు తయారు చేయించాలని చూశారన్నారు. అది వికటించి పుష్కర విషాదానికి దారి తీస్తే దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇపుడు హడావిడిగా సింగపూర్ బృందాన్ని ప్రత్యేక విమానంలో రాజమండ్రిలో దించారని రోజా వివరించారు.
Advertisement