మెమన్‌కు 30న ఉరి ఖాయం
ముంబైలో 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో నేరస్థుడు యూకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషిన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో అతడికి జూలై 30వ తేదీన ఉరిశిక్ష ఖాయమైంది. ముంబై పేలుళ్లకు మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు సహ కుట్రదారులుగా యాకూబ్ మెమన్, అతని సోదరుడు టైగర్ మెమన్‌లకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 1996 నుంచి దాదాపు ఇరవై ఏళ్ల నుంచి తాను జైల్లోనే మగ్గుతున్నాని, మనోవైకల్యంతో బాధపడుతున్నందున మరణశిక్ష నుంచి మినహాయింపు నివ్వాలని కోరుతూ యాకూబ్ గతేడాది […]
Advertisement
ముంబైలో 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో నేరస్థుడు యూకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషిన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో అతడికి జూలై 30వ తేదీన ఉరిశిక్ష ఖాయమైంది. ముంబై పేలుళ్లకు మాఫియాడాన్ దావూద్ ఇబ్రహీంతో పాటు సహ కుట్రదారులుగా యాకూబ్ మెమన్, అతని సోదరుడు టైగర్ మెమన్‌లకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 1996 నుంచి దాదాపు ఇరవై ఏళ్ల నుంచి తాను జైల్లోనే మగ్గుతున్నాని, మనోవైకల్యంతో బాధపడుతున్నందున మరణశిక్ష నుంచి మినహాయింపు నివ్వాలని కోరుతూ యాకూబ్ గతేడాది సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఒక నేరస్థుడికి ఒకే నేరంలో జీవిత ఖైదు, మరణశిక్ష విధించరని యాకూబ్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఏఆర్ దవేలతో కూడిన ధర్మాసనం ఈ వాదనలను తోసిపుచ్చింది. దీంతో యూకూబ్‌కు జూలై 30న మరణశిక్ష అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నాగపూర్ సెంట్రల్ జైలు కానీ పుణే ఎరవాడ జైల్లో కానీ ఉరిశిక్షను అమలు చేయవచ్చని నాగ్‌పూర్ సెంట్రల్ జైలు అధికారి తెలిపారు. అయితే, క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించినా యాకూబ్ మాత్రం ఆఖరి ప్రయత్నంగా గవర్నర్‌కు క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేశారు.
Advertisement