బీహార్ ఎన్నికల్లో ఎమ్ఐఎమ్ పోటీ!
ఇంతవరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఆల్ ఇండియా మజ్లిస్-ఎ- ఇత్తేహాదుల్- ముస్లిమీన్ (ఏఐఎమ్ ఐ ఎమ్) ఇప్పుడు ఉత్తరాదిపై దృష్టి సారించింది. 2014 మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇంతకాలం మున్సిపల్, కార్పొరేషన్ లకే పరిమితమైన ఎమ్ ఐఎమ్ తొలిసారిగా మహారాష్ట్రలో అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఇప్పడు బీహార్ లో తన అదృష్టాన్ని పరీక్షించుని జాతీయ పార్టీగా ఆవిర్భవించాలని చూస్తోంది. గత […]
Advertisement
ఇంతవరకు హైదరాబాద్‌కే పరిమితమైన ఆల్ ఇండియా మజ్లిస్-ఎ- ఇత్తేహాదుల్- ముస్లిమీన్ (ఏఐఎమ్ ఐ ఎమ్) ఇప్పుడు ఉత్తరాదిపై దృష్టి సారించింది. 2014 మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే! హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇంతకాలం మున్సిపల్, కార్పొరేషన్ లకే పరిమితమైన ఎమ్ ఐఎమ్ తొలిసారిగా మహారాష్ట్రలో అసెంబ్లీలో అడుగుపెట్టింది. ఇప్పడు బీహార్ లో తన అదృష్టాన్ని పరీక్షించుని జాతీయ పార్టీగా ఆవిర్భవించాలని చూస్తోంది. గత మూడేళ్లుగా బీహార్, ఉత్తర్ ప్రదేశ్‌లో తలెత్తిన మతకలహాలపై ఎమ్ఐ ఎమ్ ముస్లింల పక్షాన పార్లమెంటుతో సహా అన్ని వేదికలపై పోరాడుతూనే ఉంది.
జై మీమ్.. జై భీమ్ నినాదంతో ముందుకు
తమ పార్టీ కేవలం ముస్లిం పక్షపాతి అన్న ముద్రను తొలగించే పనిలోనూ సఫలీకృతమవుతోంది. హైదాబాద్, కర్ణాటక, మహారాష్ట్ర స్థానిక సంస్థ ఎన్నికల్లో హిందువులకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవడమే ఇందుకు నిదర్శనం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ల సంక్షేమమే లక్ష్యంగా అన్ని రాష్ర్టాల్లో పోటీ చేసే దిశగా పావులు కదుపుతోంది. అక్టోబరులో జరగనున్న బీహార్ ఎన్నికల్లో ముస్లిములు, దళిత సంక్షేమంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అందుకే జై మీమ్.. జై భీమ్ అనే కొత్త నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. జై మీమ్ అంటే ముస్లిములు, ఇక జై భీమ్ అంటే డా.భీమ్ రావ్ అంబేద్కర్ ఆలోచన ప్రకారం.. దళిత బహుజనుల సంక్షేమమే లక్ష్యంగా ఎమ్ ఐ ఎమ్ పోరాడుతుందన్న నినాదంతో జనాల్లోకి వెళదామని సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఎస్పీ, బీఎస్పీలతో కలిసి ముందుకుసాగాలని నిశ్చయించుకుంది. బీజేపీని వ్యతిరేకిస్తున్న ఎస్పీ, బీఎస్పీలు ఎమ్ ఐ ఎమ్‌ను కలుపుకొని పోవడం వల్ల ముస్లిం, మైనారిటీ ఓటర్లను ఆకర్షించాలన్న వ్యూహంలో ఉన్నాయి. బిహార్ ఎన్నికల్లో ఎమ్ ఐఎమ్ వ్యూహం ఫలిస్తే.. 2017లో జరిగే ఉత్తర్ ప్రదేశ్‌లోనూ పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Advertisement