ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే పోలీసులపై చర్యలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులకు ఆధునిక వాహనాలు సమకూర్చడం, పోలీస్ స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు ప్రతి స్టేషన్‌లోని కేసుల సమాచారం వెంటనే డీజీపీ కార్యాలయానికి అందేలా రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లను కంప్యూటరీకరించారు. దీంతో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయకుండా బాధితులకు వైరి పక్షాలకు మధ్య రాజీ కుదిర్చే ఇన్స్‌పెక్టర్లకు, వైరిపక్షం వైపు మొగ్గుచూపి బాధితుడిని ఖాతరు చేయని ఇన్స్‌పెక్లర్లకు చిక్కులు తప్పవు. అందుకోసం పీఎస్‌లో నమోదు చేసిన ప్రతి కేసు ఎఫ్ఐఆర్ కాపీని వెంటనే ఆన్‌లైన్ ద్వారా డీజీపీ […]
Advertisement
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసులకు ఆధునిక వాహనాలు సమకూర్చడం, పోలీస్ స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు ప్రతి స్టేషన్‌లోని కేసుల సమాచారం వెంటనే డీజీపీ కార్యాలయానికి అందేలా రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లను కంప్యూటరీకరించారు. దీంతో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయకుండా బాధితులకు వైరి పక్షాలకు మధ్య రాజీ కుదిర్చే ఇన్స్‌పెక్టర్లకు, వైరిపక్షం వైపు మొగ్గుచూపి బాధితుడిని ఖాతరు చేయని ఇన్స్‌పెక్లర్లకు చిక్కులు తప్పవు. అందుకోసం పీఎస్‌లో నమోదు చేసిన ప్రతి కేసు ఎఫ్ఐఆర్ కాపీని వెంటనే ఆన్‌లైన్ ద్వారా డీజీపీ కార్యాలయానికి చేరేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ ను కూడా పోలీస్ కంప్యూటర్స్ విభాగం అభివృద్ధి చేసింది. అలాగే పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేయడం లేదని భావిస్తే బాధితులు నేరుగా డీజీపీని కలిసి విన్నవించినా, పోస్ట్ ద్వారా సమాచారం ఇచ్చినా వాటిపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఈ విధానం వల్ల ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ పారదర్శకత ఏర్పడుతుందని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
Advertisement