సీఎం అవినీతి... ఆత్మరక్షణలో కాంగ్రెస్‌!

పార్లమెంట్‌లో అధికార భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న కాంగ్రెస్‌ ఆశలు అడియాశలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌తోపాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు, మహారాష్ట్రలో ఇద్దరు మంత్రుల అవినీతిపై చేలరేగిపోవాలనుకున్న కాంగ్రెస్‌కు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ రూపంలో కష్టకాలం ఎదురైంది. ఇది అదనుగా చేసుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం భరతం పడతామన్న కాంగ్రెస్‌‌పై బిజెపి ఎదురుదాడి చేస్తోంది. హస్తం పార్టీ అధినాయకత్వాన్ని గుక్క తిప్పకోనివ్వకుండా చేస్తోంది. యూపీఏ ప్రభుత్వంలో ఓ […]

Advertisement
Update:2015-07-22 10:56 IST
పార్లమెంట్‌లో అధికార భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న కాంగ్రెస్‌ ఆశలు అడియాశలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌తోపాటు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు, మహారాష్ట్రలో ఇద్దరు మంత్రుల అవినీతిపై చేలరేగిపోవాలనుకున్న కాంగ్రెస్‌కు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ రూపంలో కష్టకాలం ఎదురైంది. ఇది అదనుగా చేసుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం భరతం పడతామన్న కాంగ్రెస్‌‌పై బిజెపి ఎదురుదాడి చేస్తోంది. హస్తం పార్టీ అధినాయకత్వాన్ని గుక్క తిప్పకోనివ్వకుండా చేస్తోంది. యూపీఏ ప్రభుత్వంలో ఓ కేంద్ర మంత్రి తనకు తెలిసిన ఓ పెద్దమనిషిని విదేశాలకు పంపించడానికి తన సాయం కోరారని, ఈ విషయాన్ని పార్లమెంటులోనే చెబుతానని సుష్మా స్వరాజ్‌ చేసిన ట్వీట్‌తో వణుకు మొదలైన కాంగ్రెస్‌కు ఇపుడు కొత్తగా తగిలిన షాక్‌తో బెంబేలు ఎక్కువైంది. సుష్మా ట్వీట్‌ నుంచి ఇంకా కోలుకోని సమయంలోనే బిజెపి మరో బ్రహ్మాస్త్రం ప్రయోగించింది. ఉత్తరాఖండ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హరీష్‌ రావత్ అవినీతి బాగోతాన్ని బయట పెట్టింది. ముఖ్యమంత్రి హోదాలో హరీష్‌ రావత్‌ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడంటూ మీడియాకు ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పట్టపగలే చుక్కలు కనిపించే చిక్కుల్లో పడింది. బిజెపిపై విరుచుకుపడాల్సిన తరుణంలో ఆత్మరక్షణలో పడిపోయింది. అయితే హరీష్‌ రావత్‌ మాత్రం తానేమీ అవినీతికి పాల్పడలేదని ధీమాగా చెబుతున్నారు. మరి వీడియోలో ఉన్న చిత్రాలేంటో చెప్పమని భారతీయ జనతాపార్టీ అంటోంది. మొత్తం మీద ఇరు ప్రధాన పార్టీలు అవినీతి చరిత్ర లిఖించుకుని పార్లమెంటు సమావేశాల సాక్షిగా దేశ ప్రజలకు జవాబుదారీ అయ్యారు. ఈ వర్షాకాల సమావేశాల్లో ఎవరి అవినీతి ఎంత ఉందో జనం తూకమేయడం ఖాయం!
Tags:    
Advertisement

Similar News