వర్శిటీల్లో గవర్నర్‌కు బదులు ఛాన్సలర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్శిటీలపై తనదైన ముద్ర వేయాలని సంకల్పించారు. అందుకోసం గవర్నర్ స్థానంలో ప్రతి యూనివర్శిటీకి ఛాన్సలర్‌ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో క్రమశిక్షణారాహిత్యం కనిపిస్తోందని, దానిని గాడిలో పెట్టాలంటే నిపుణులైన ఛాన్సలర్ అవసరమని అందుకోసం కొత్తగా వర్శిటీల చట్టాన్ని రూపొందించాలని ఆయన ఉన్నతవిద్యపై మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు. ఛాన్సలర్లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని, అలాగే వారి నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. […]
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్శిటీలపై తనదైన ముద్ర వేయాలని సంకల్పించారు. అందుకోసం గవర్నర్ స్థానంలో ప్రతి యూనివర్శిటీకి ఛాన్సలర్‌ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో క్రమశిక్షణారాహిత్యం కనిపిస్తోందని, దానిని గాడిలో పెట్టాలంటే నిపుణులైన ఛాన్సలర్ అవసరమని అందుకోసం కొత్తగా వర్శిటీల చట్టాన్ని రూపొందించాలని ఆయన ఉన్నతవిద్యపై మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదేశించారు. ఛాన్సలర్లను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని, అలాగే వారి నియామకం కోసం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అన్ని వర్శిటీలకు ఉన్నత విద్యాశాఖ నోడల్ ఏజెన్సీగా పని చేయాలని, వైద్య విద్యను కూడా విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజన్ ఆచార్య తదితర్లు పాల్గొన్నారు.
Advertisement