దేశంలో 20 శాతం రేపిస్టు భర్తలు!
భారతదేశంలో రేపిస్టు భర్తల సంఖ్య ఎక్కువగా ఉందని యనైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ నివేదిక వెల్లడించింది. ప్రతి ఐదుగురు మగవారిలో ఒకరు భార్యను లైంగికంగా వేధిస్తున్నారని, దేశంలోని రెండు వంతుల మంది వివాహిత మహిళలు తమ భర్తల చేతిలో అత్యాచారానికి గురవుతున్నారని, వీరిలో 15 నుంచి 49 మధ్య వయసు కలిగిన మహిళలు అధికంగా ఉన్నారని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది.ఈ నివేదికను కేంద్ర మహిళ శిశు సంక్షేమశాఖకు పామ్ రాజ్‌పుట్ కమిటీ అందచేసింది. అత్యాచారం […]
Advertisement
భారతదేశంలో రేపిస్టు భర్తల సంఖ్య ఎక్కువగా ఉందని యనైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ నివేదిక వెల్లడించింది. ప్రతి ఐదుగురు మగవారిలో ఒకరు భార్యను లైంగికంగా వేధిస్తున్నారని, దేశంలోని రెండు వంతుల మంది వివాహిత మహిళలు తమ భర్తల చేతిలో అత్యాచారానికి గురవుతున్నారని, వీరిలో 15 నుంచి 49 మధ్య వయసు కలిగిన మహిళలు అధికంగా ఉన్నారని ఆ సంస్థ తన నివేదికలో పేర్కొంది.ఈ నివేదికను కేంద్ర మహిళ శిశు సంక్షేమశాఖకు పామ్ రాజ్‌పుట్ కమిటీ అందచేసింది. అత్యాచారం భర్త చేసినా, అది నేరంగానే పరిగణించాలని డిమాండ్ దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. మారిటల్ రేప్‌ను కూడా అత్యాచారంగానే పరిగణించి కఠిన శిక్షలు విధిస్తే వివాహిత మహళలపై లైంగిక హింస తగ్గుతుందని కమిటీ మహిళా శిశు సంక్షేమశాఖను కోరింది. లైంగిక హింసకు గురవుతున్న వివాహితుల కోసం చట్టాలను మార్చాలని వారు కోరారు. ఈ సందర్భంగా 2011లో ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ నివేదికతోపాటు భర్త చేతిలో దారుణంగా లైంగిక హింసకు గురైన కొంతమంది కేస్‌స్టడీలను కూడా వివరించారు.
Advertisement