వామపక్ష పార్టీల 'భరోసా బస్సు' యాత్ర ప్రారంభం
పారిశుద్ధ్య కార్మికుల పట్ల తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న కక్ష్య పూరిత వైఖరికి నిరసనగా వామపక్ష పార్టీలు చేపట్టిన భరోసా బస్సు యాత్ర నల్లగొండలో ప్రారంభమైంది. ఈ యాత్ర ప్రారంభ సందర్భంగా నల్లగొండ క్లాక్ టవర్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రసంగించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్ హైదరాబాద్‌కు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాననే విషయం ఆయన గుర్తించడం లేదని విమర్శించారు. […]
Advertisement
పారిశుద్ధ్య కార్మికుల పట్ల తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న కక్ష్య పూరిత వైఖరికి నిరసనగా వామపక్ష పార్టీలు చేపట్టిన భరోసా బస్సు యాత్ర నల్లగొండలో ప్రారంభమైంది. ఈ యాత్ర ప్రారంభ సందర్భంగా నల్లగొండ క్లాక్ టవర్ వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రసంగించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. కేసీఆర్ హైదరాబాద్‌కు మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాననే విషయం ఆయన గుర్తించడం లేదని విమర్శించారు. కార్మికుల పట్ల కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, అధికారం దక్కిన తర్వాత ఆయన కేవలం పెద్దల పక్షపాతిగా మారారని తమ్మినేని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలను ఫార్మా కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్న కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికులకు కేవలం రూ. 1100 పెంచడం లేదని విమర్శించారు.
Advertisement