ఎన్టీఆర్ స్టేడియంలోని ఆరు ఎకరాల్లోనే కళాభారతి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కళాభారతి నిర్మాణానికి ఎన్టీఆర్ స్టేడియంలో కేవలం ఆరు ఎకరాలే ఉపయోగిస్తామని జీహెచ్ఎంసీ సోమవారం హైకోర్టుకు తెలిపింది. ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన 14 ఎకరాల భూమిలో ప్రభుత్వం కళాభారతి నిర్మాణానికి పూనుకోవడం లేదని కేవలం ఆరు ఎకరాలు మాత్రమే అందుకోసం వినియోగిస్తుందని జీహెచ్ఎంసీ హైకోర్టుకు వివరించింది. మిగిలిన 8 ఎకరాల భూమిని వాకింగ్ కోసం వచ్చే వారికి, పార్కింగ్, పచ్చదనం, ఇతర అవసరాల కోసం వదిలేస్తామని తెలిపింది. ఎన్టీఆర్ స్టేడియం పక్కనే ఉన్న […]
Advertisement
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కళాభారతి నిర్మాణానికి ఎన్టీఆర్ స్టేడియంలో కేవలం ఆరు ఎకరాలే ఉపయోగిస్తామని జీహెచ్ఎంసీ సోమవారం హైకోర్టుకు తెలిపింది. ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన 14 ఎకరాల భూమిలో ప్రభుత్వం కళాభారతి నిర్మాణానికి పూనుకోవడం లేదని కేవలం ఆరు ఎకరాలు మాత్రమే అందుకోసం వినియోగిస్తుందని జీహెచ్ఎంసీ హైకోర్టుకు వివరించింది. మిగిలిన 8 ఎకరాల భూమిని వాకింగ్ కోసం వచ్చే వారికి, పార్కింగ్, పచ్చదనం, ఇతర అవసరాల కోసం వదిలేస్తామని తెలిపింది. ఎన్టీఆర్ స్టేడియం పక్కనే ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో పది ఎకరాల స్థలం ఉందని, అందులో 9 ఎకరాల స్థలం పిల్లలు ఆడుకోవడానికి అనువుగా ఉందని జీహెచ్ఎంసీ న్యాయస్థానానికి చెప్పింది. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును మంగళవారానికి వాయిదా వేసింది. ఎన్టీఆర్ స్టేడియంలోని 14 ఎకరాల స్థలంలో తెలంగాణ కళాభారతిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 14 ఎకరాల భూమిని సాంస్కృతిక శాఖకు అప్పగిస్తూ జూన్ 23ను పురపాలక శాఖ జీవో జారీ చేసింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్‌కు చెందిన ఎ. సుధాకర్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు.
Advertisement