యుపీ మంత్రి సెక్రటరీ పేరుతో అత్యాచారం
యూపీలో మంత్రుల పేరు చెప్పి ఎలాంటి ఘోరానికైనా యధేచ్ఛగా పాల్పడవచ్చు. జర్నలిస్టులను సజీవంగా దహనం చేయడం, మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, వాటిని వీడియోలో చిత్రీకరించి బెదిరించడం… వంటి అకృత్యాలు అక్కడ సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి నియంత్రణ లేదు. తాజాగా యూపీ మంత్రి పర్సనల్ సెక్రటరీ పేరుతో ఓ దుండుగుడు చేసిన దుశ్చర్య వెలుగు చూసింది. రతన్ లాల్ శర్మ అనే వ్యక్తి తాను రాష్ట్ర మంత్రికి పర్సనల్ సెక్రటరీనని చెప్పి స్కూలు […]
Advertisement
యూపీలో మంత్రుల పేరు చెప్పి ఎలాంటి ఘోరానికైనా యధేచ్ఛగా పాల్పడవచ్చు. జర్నలిస్టులను సజీవంగా దహనం చేయడం, మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం, వాటిని వీడియోలో చిత్రీకరించి బెదిరించడం… వంటి అకృత్యాలు అక్కడ సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలపై అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి నియంత్రణ లేదు. తాజాగా యూపీ మంత్రి పర్సనల్ సెక్రటరీ పేరుతో ఓ దుండుగుడు చేసిన దుశ్చర్య వెలుగు చూసింది. రతన్ లాల్ శర్మ అనే వ్యక్తి తాను రాష్ట్ర మంత్రికి పర్సనల్ సెక్రటరీనని చెప్పి స్కూలు మహిళా ప్రిన్సిపల్‌ను నమ్మించాడు. ఎన్జీవో ప్రాజెక్టు ఇప్పిస్తానని ఆమె వద్ద నుంచి రూ. 21 లక్షలు దండుకొని ఆమెపై అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగకుండా ఈ వ్యవహారాన్ని వీడియోలో చిత్రీకరించి బెదిరింపులకు దిగాడు. ఈ విషయాన్ని బయటపెడితే వీడియోను అందరికీ తెలిసేలా చేస్తానని బెదిరిస్తూ లైంగిక హింసకు పాల్పడుతున్నాడని ఈ ప్రిన్సిపల్ హుస్సేన్‌జంగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రతన్ లాల్ శర్మతో పాటు మరో నలుగురుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు స్టేషన్ ఆఫీసర్ శివశంకర్ తెలిపారు.
Advertisement