రాముడి సొమ్మును కాజేసిన విశ్వహిందూ పరిషత్
అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం దాతలు ఇచ్చిన రూ. 1400 కోట్ల రూపాయల బంగారం, నగదును విశ్వహిందూ పరిషత్ కాజేసిందని అఖిల భారతీయ హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు ఇచ్చిన బంగారం, నగదు విరాళాలను వీహెచ్‌పీ తన ఖాతాలో జమ చేసుకుందని మహాసభ జాతీయ అధికార ప్రతినిధి దేవేంద్ర పాండ్యే ఆరోపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, వీహెచ్ పి అగ్రనేత అశోక్ సింఘాల్‌లే విరాళాల దుర్వినియోగానికి […]
Advertisement
అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం దాతలు ఇచ్చిన రూ. 1400 కోట్ల రూపాయల బంగారం, నగదును విశ్వహిందూ పరిషత్ కాజేసిందని అఖిల భారతీయ హిందూ మహాసభ (ఏబీహెచ్ఎం) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రామభక్తులు ఇచ్చిన బంగారం, నగదు విరాళాలను వీహెచ్‌పీ తన ఖాతాలో జమ చేసుకుందని మహాసభ జాతీయ అధికార ప్రతినిధి దేవేంద్ర పాండ్యే ఆరోపించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్, వీహెచ్ పి అగ్రనేత అశోక్ సింఘాల్‌లే విరాళాల దుర్వినియోగానికి బాధ్యులని ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. సభ్యులు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను వీహెచ్‌పీ ఖండించింది. భక్తులు ఇచ్చిన విరాళాలను కరసేవక్ పురంలోని రామాలయ నిర్మణానికి ఉపయోగించామని ప్రకటించింది.
Advertisement