ఊరంతా అడవికి పోయింది..
నిజమే ఆ ఊరు ఊరంతా అడవికి వెళ్లిపోయింది. అన్ని ఇళ్లకూ తాళాలు వేసి మరీ వెళ్లిపోయారు. విషయం తెలుసుకుని పోలీసులు వచ్చి ఊరికి కాపలాగా ఉన్నారు. నల్లగొండ జిల్లాలోని ఆత్మకూరు మండలంలో గల ఆ ఊరి పేరు తుమ్మల పెన్‌పహాడ్. ఇంతకూ అందరూ అడవికి ఎందుకు వెళ్లారని అనుకుంటున్నారా? వరుసగా మూడేళ్లుగా ఆ ఊరిలో వర్షాలు కురవడం లేదట. కరువు కరాళ నృత్యం చేస్తోంది. అందుకే ఊరిలో నివసిస్తున్న 6 వేల మంది కట్టకట్టుకుని వనవాసానికి వెళ్లిపోయారు. […]
Advertisement
నిజమే ఆ ఊరు ఊరంతా అడవికి వెళ్లిపోయింది. అన్ని ఇళ్లకూ తాళాలు వేసి మరీ వెళ్లిపోయారు. విషయం తెలుసుకుని పోలీసులు వచ్చి ఊరికి కాపలాగా ఉన్నారు. నల్లగొండ జిల్లాలోని ఆత్మకూరు మండలంలో గల ఆ ఊరి పేరు తుమ్మల పెన్‌పహాడ్. ఇంతకూ అందరూ అడవికి ఎందుకు వెళ్లారని అనుకుంటున్నారా? వరుసగా మూడేళ్లుగా ఆ ఊరిలో వర్షాలు కురవడం లేదట. కరువు కరాళ నృత్యం చేస్తోంది. అందుకే ఊరిలో నివసిస్తున్న 6 వేల మంది కట్టకట్టుకుని వనవాసానికి వెళ్లిపోయారు. అక్కడ వానదేవుడికి పూజలు చేశారు. వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశారు. రోజంతా ఆడుతూ పాడుతూ గడిపారు. ఊరు ఊరంతా దాపులలో ఉన్న అడవికి వెళుతున్నారన్న విషయం ఆనోటా ఈనోటా తెలుసుకున్న పోలీసులు గ్రామానికి రక్షణగా కొంతమంది పోలీసులను నియోగించారు. ఊర్లోని జనాభా మాత్రమే కాదు వారి పెంపుడు జంతువులు, గొడ్డుగోదా అంతటినీ తమతో తరలించుకుపోయారు. ఊర్లో ఒక్క ప్రాణి కూడా లేదు. అడవిలోనే వంటావార్పూ చేసుకున్నారు. ఆడిపాడి అలసిపోయి సాయంత్రానికి ఊరికి తిరిగివచ్చారు.
Advertisement