200 దేశీయ హెలికాప్టర్ల తయారీకి రష్యా సహకారం
చిరకాల మిత్రదేశం రష్యా మన దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి మరింత సహకారం అందించనుంది. రష్యా భాగస్వామ్యంతో దేశీయంగా 200 హెలికాప్టర్లు తయారు చేయనున్నట్లు రష్యాలో భారత రాయబారి పీఎస్ రాఘవన్ తెలిపారు. ప్రధాని చేపట్టిన మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా భారత్ రక్షణ రంగంలో చేసుకున్న తొలి ఒప్పందం ఇదేనని రాఘవన్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రష్యా మనకు రక్షణ రంగంలో ఎంతో సహాయం చేస్తోందని, ప్రస్తుతం మన దేశ రక్షణ […]
Advertisement
చిరకాల మిత్రదేశం రష్యా మన దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి మరింత సహకారం అందించనుంది. రష్యా భాగస్వామ్యంతో దేశీయంగా 200 హెలికాప్టర్లు తయారు చేయనున్నట్లు రష్యాలో భారత రాయబారి పీఎస్ రాఘవన్ తెలిపారు. ప్రధాని చేపట్టిన మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా భారత్ రక్షణ రంగంలో చేసుకున్న తొలి ఒప్పందం ఇదేనని రాఘవన్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రష్యా మనకు రక్షణ రంగంలో ఎంతో సహాయం చేస్తోందని, ప్రస్తుతం మన దేశ రక్షణ రంగం 60 నుంచి 70 శాతం రష్యా సరఫరా చేసే ఆయుధాలు, ఇతర సాంకేతికత పైనే ఆధారపడి ఉందని ఆయన చెప్పారు.
Advertisement