హిందు మతంలోకి 39 మంది దళిత క్రిష్టియన్లు

కేరళలో 39 మంది దళిత క్రిష్టియన్లు హిందు మతం స్వీకరించారు. 11 కుటుంబాలకు చెందిన వీరందరినీ హిందు మతంలోకి తీసుకురావడానికి విశ్వ హిందూ పరిషత్‌ నేతృత్వం వహించింది. వివాదాస్పద ఘర్‌ వాపసి కార్యక్రమం కింద జరిగిన ఈ క్రతువుకు చెరియనాడు జిల్లాలోని భద్రకాళి ఆలయం వేదికైంది. తొలుత గణపతి హోమం, ఆ పిమ్మట శుద్ధి హోమం నిర్వహించిన తర్వాత వీరందరితో గాయత్రి జపం చేయించి హిందు మతంలోకి  ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి విహెచ్‌పీ, ఆర్య సమాజ్‌కు చెందిన […]

Advertisement
Update:2015-07-19 19:01 IST
కేరళలో 39 మంది దళిత క్రిష్టియన్లు హిందు మతం స్వీకరించారు. 11 కుటుంబాలకు చెందిన వీరందరినీ హిందు మతంలోకి తీసుకురావడానికి విశ్వ హిందూ పరిషత్‌ నేతృత్వం వహించింది. వివాదాస్పద ఘర్‌ వాపసి కార్యక్రమం కింద జరిగిన ఈ క్రతువుకు చెరియనాడు జిల్లాలోని భద్రకాళి ఆలయం వేదికైంది. తొలుత గణపతి హోమం, ఆ పిమ్మట శుద్ధి హోమం నిర్వహించిన తర్వాత వీరందరితో గాయత్రి జపం చేయించి హిందు మతంలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి విహెచ్‌పీ, ఆర్య సమాజ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇంకా అనేకమంది తిరిగి తమ మతంలోకి రావడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. వీరందరినీ త్వరలోనే ఆహ్వానిస్తాం అని విశ్వహిందూ పరిషత్‌ అలప్పూజ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌జీ చెప్పారు.
Tags:    
Advertisement

Similar News