విశిష్టతల సమాహారం... ఏపీ సీడ్ క్యాపిటల్ ప్లాన్
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అందజేశారు. ఇందులో అనేక అంశాలను పొందుపరిచారు. అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం సాయంత్రం అందజేసిన ఆ ప్లాన్‌లో బ్రహ్మస్థానంలో ఏమేమి ఉంటాయి, సచివాలయం ఎక్కడ నిర్మిస్తారు.. హైకోర్టు ఎక్కడ.. తదితర అంశాలను పొందుపరిచారు. నవ్యాంధ్ర రాజధాని రూపురేఖలన్నీ ఈ మాస్టర్ ప్లాన్‌లో కనిపించాయి. అంతకు ముందే ఈశ్వరన్ రాజధాని నగరమైన […]
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అందజేశారు. ఇందులో అనేక అంశాలను పొందుపరిచారు. అమరావతి సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం సాయంత్రం అందజేసిన ఆ ప్లాన్‌లో బ్రహ్మస్థానంలో ఏమేమి ఉంటాయి, సచివాలయం ఎక్కడ నిర్మిస్తారు.. హైకోర్టు ఎక్కడ.. తదితర అంశాలను పొందుపరిచారు. నవ్యాంధ్ర రాజధాని రూపురేఖలన్నీ ఈ మాస్టర్ ప్లాన్‌లో కనిపించాయి. అంతకు ముందే ఈశ్వరన్ రాజధాని నగరమైన అమరావతి మాస్టర్ ప్లాన్‌ను చంద్రబాబుకు అందజేశారు. ఇప్పుడు సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను అందజేశారు. సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌లో ప్రపంచ స్థాయిలో ఉన్న అత్యంత అధునాతనమైన వ్యవస్థలన్నీ పొందు పరిచారు. ఆధునాతన సౌకర్యాలతోపాటు.. ఆకర్షణీయంగా ఉండాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో బహుళ అంతస్థుల భవనాలు, హైవేలు, వాటర్ లైన్స్ ఇతర హంగులతో సర్వాంగ సుందరంగా ఈ సీడ్ ప్లాన్ తయారు చేసినట్టు తెలుస్తోంది.
ప్రపంచస్థాయి నగరంగా అమరావతి
భారత్‌లో ఇప్పటి వరకు ప్రపంచస్థాయి నగరాల నిర్మాణం కాలేదని, ఇంతగొప్ప నగరం ఏపీదే కావడం విశేషమని సీఎం పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహాయపడాలని కోరారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 7,420 కి.మీ పరిధిలో ఏపీ క్యాపిటల్ రీజియన్ ఉంటుందని, 40 లక్షల జనాభాకు అనుగుణంగా రాజధాని అమరావతి ఉంటుందని సీఎం వివరించారు. 217 చ.కి.మీ పరిధిలో అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ఈశ్వరన్ చంద్రబాబు ఎదుట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని నిర్మాణ ప్రణాళిక అద్భుతంగా ఉందని, బృహత్ ప్రణాళికలు రూపొందించిన 30 మంది సభ్యుల సింగపూర్ బృందానికి అభినందనలు తెలిపారు. పుష్కరాల సమయంలో మాస్టర్ ప్లాన్ ఇవ్వడం శుభపరిణామం అని పేర్కొన్నారు. సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అది నెరవేరుస్తామని సీఎం ఉద్ఘాటించారు. 3 లక్షల నివాస గృహాలకు అనుగుణంగా సీడ్ క్యాపిటల్ ప్రణాళిక ఉందన్నారు. బృహత్ ప్రణాళికతో 7 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశముందని వివరించారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వామిగా సింగపూర్ ఉంటుందని చెప్పారు. మూడు దశల్లో అమరావతి అభివృద్ధి జరుగుతుందని వివరిస్తూ.. సీడ్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్ భాగాలుగా రాజధానిని అభివృద్ధి చేస్తామన్నారు. అమరావతి అభివృద్ధిలో స్విస్ చాలెంజ్ పద్ధతిలో సింగపూర్ భాగస్వామిగా ఉంటుందన్నారు. 2018లోపు అమరావతి తొలిదశ పనులను పూర్తిచేస్తామని చెప్పారు.
ఏపీ రాజధానికి సంబంధించి మధ్యలోనే బ్రహ్మస్థానం అని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే రాజధాని నాడీ కేంద్రం అన్నమాట… ఇక్కడ వెయ్యి పడకల ఉచిత ఆస్పత్రి నిర్మించనున్నారు. దాని చుట్టూ 200 కి.మీ. మేర నది నుంచి నీళ్లు తీసుకువచ్చి ఆర్ట్‌ఫిషియల్‌గా ఇన్‌ల్యాండ్ వాటర్స్‌ను తయారు చేసి దానిని బ్లూవేగా మారుస్తారు. అంటే పడవుల ద్వారా రాజధాని నగరంలోని ఏ ప్రాంతానికైనా వెళ్లేలా మాస్టర్ ప్లాన్‌లో రూపొందించారు. దానికి సమీపంలోనే అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించనున్నారు. 250 కి.మీ. పొడవున గ్రీన్‌వే ఏర్పాటు చేయనున్నారు. నడవడానికి వీలుగా (ఆరోగ్యం కోసం) ఇది ఉంటుంది. అత్యంత ఆధునాతనంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మార్గాలు ఇందులో ఉన్నాయి. నగరం మధ్య నుంచే మెట్రో రైలు వెళ్లే ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒక యూనివర్షిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని విశిష్టతలున్న విధంగా అమరావతి నగరం తయారైతే ప్రపంచంలోని అత్యంత సుందర నగరంగా ఇది పోటీ పడుతుందన్నది ప్రభుత్వ భావన.
నాలుగు విభాగాల్లో సీడ్ క్యాపిటల్..
నాలుగు విభాగాల్లో సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారు. అమరావతి గేట్‌వే, అమరావతి డౌన్‌టౌన్, అమరావతి గవర్నమెంట్ కోర్, అమరావతి వాటర్ ఫ్రంట్‌గా విభజనించారు. వీటిలో 135 కి.మీ మేర మెట్రో రైల్, 250 కి.మీ టూరిజం సర్క్యూట్, 1000 కి.మీ మేర రోడ్లు, 40 శాతం పార్కులు, వినోద కేంద్రాలు ఉంటాయి.