చైనాలో భారతీయుడి అరెస్ట్, దేశ బహిష్కరణ
నిషేధిత ఉగ్రవాద వీడియోలను హోటల్ గదిలో వీక్షించినందుకు భారతీయ వ్యాపారి రాజీవ్ మోహన్ కులశ్రేష్ఠను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాతో భారత ఎంబసీ జరిపిన చర్చలు ఫలించడంతో అతడిని చైనా ప్రభుత్వం విడుదల చేసి దేశం నుంచి పంపేసింది. ఢిల్లీకి చెందిన 47 ఏళ్ల రాజీవ్ మోహన్ సౌతాఫ్రికా చారిటీ సంస్థ సభ్యులతో కలిసి జూలై 10వ తేదీని 47 రోజుల టూర్ కోసం చైనా వెళ్లారు. అక్కడ హోటల్ రూములో కూర్చొని తోటి విదేశీయులతో […]
Advertisement
నిషేధిత ఉగ్రవాద వీడియోలను హోటల్ గదిలో వీక్షించినందుకు భారతీయ వ్యాపారి రాజీవ్ మోహన్ కులశ్రేష్ఠను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాతో భారత ఎంబసీ జరిపిన చర్చలు ఫలించడంతో అతడిని చైనా ప్రభుత్వం విడుదల చేసి దేశం నుంచి పంపేసింది. ఢిల్లీకి చెందిన 47 ఏళ్ల రాజీవ్ మోహన్ సౌతాఫ్రికా చారిటీ సంస్థ సభ్యులతో కలిసి జూలై 10వ తేదీని 47 రోజుల టూర్ కోసం చైనా వెళ్లారు. అక్కడ హోటల్ రూములో కూర్చొని తోటి విదేశీయులతో కలిసి చైనాలో నిషేధించిన ఉగ్రవాద వీడియోలు తిలకించారు. దీంతో ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే ఆరోఫణలతో చైనా పోలీసులు రాజీవ్‌ను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం విడుదల చేసి దేశం నుంచి పంపేసారు. చారిటీ సభ్యులు ఎవరిపైనా వారి దేశాల్లో క్రిమినల్ రికార్డు లేదని, వారికి ఉగ్రవాదులతో సంబంధాలు లేవని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.
Advertisement