కొత్త జిల్లాగా అమరావతి!
కృష్ణా , గుంటూరు జిల్లాలోని దాదాపు 59 మండలాలను కలిపి రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మొత్తం కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని అధికారవర్గాలంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక కొత్త ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే 50 సంవత్సరాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు మొదటి నుండి […]
కృష్ణా , గుంటూరు జిల్లాలోని దాదాపు 59 మండలాలను కలిపి రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మొత్తం కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..దానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని అధికారవర్గాలంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక కొత్త ప్రణాళికలు రచిస్తోంది. రాబోయే 50 సంవత్సరాల అవసరాలు దృష్టిలో పెట్టుకుని రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు మొదటి నుండి చెబుతున్నారు. అందుకోసం కృష్ణా , గుంటూరు ప్రాంతాల్లోని చాలా భాగాన్ని సీఆర్ డిఏ (కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ) పేరుతో ఓ సంస్థను ఏర్పాటుచేశారు. గతంలో విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలను కలిపి ఒక అథారిటీ ఉండేది. సీఆర్‌డీఏ ఏర్పడిన తర్వాత అది రద్దయింది. రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించిన తర్వాత పాత అథారిటీని తొలగించి, దాని స్థానంలో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ, సీఆర్‌డీఏని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం సీఆర్‌డీఏ ప్రాంతం మొత్తాన్ని కలిపి ఓ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం..రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేపట్టి అమరావతి కేంద్రంగా కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు తొలిదశలో రాజధాని పరిధిలోని తొమ్మిది శాఖల జిల్లా స్థాయి కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తోంది. 59 మండలాలు, రెండు కార్పోరేషన్లు, 10 మున్సిపాలిటీలు కలపి అమరావతి జిల్లా, అమరావతి కేంద్రంగా జిల్లా రిజిష్ట్రార్ కార్యాలయం ఏర్పాటు పై ఇటీవలే ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.