యోగా గురువు రాందేవ్ బాబాకు డాక్టరేట్
ప్రఖ్యాత యోగా గురువు బాబా రాందేవ్ కు హర్యానా అగ్రికల్చర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. హిసార్‌లో ఈనెల 26న జరగనున్న అగ్రికల్చర్ యూనివర్శిటీ 26వ స్నాతకోత్సవం సందర్భంగా బాబా రాందేవ్‌కు డాక్టరేట్‌ను ప్రదానం చేస్తారు. ప్రాథమిక విద్యలోనే స్కూలు మానేసి హైస్కూలు చదువు కూడా పూర్తి చేయని బాబా రాందేవ్ కు యూనివర్శిటీ డాక్టరేట్‌ను ఇవ్వడం పట్ల పలు విమర్శలు చెలరేగాయి. అయితే, వీటిని హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు కొట్టిపారేశారు. రాందేవ్ కు […]
Advertisement
ప్రఖ్యాత యోగా గురువు బాబా రాందేవ్ కు హర్యానా అగ్రికల్చర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. హిసార్‌లో ఈనెల 26న జరగనున్న అగ్రికల్చర్ యూనివర్శిటీ 26వ స్నాతకోత్సవం సందర్భంగా బాబా రాందేవ్‌కు డాక్టరేట్‌ను ప్రదానం చేస్తారు. ప్రాథమిక విద్యలోనే స్కూలు మానేసి హైస్కూలు చదువు కూడా పూర్తి చేయని బాబా రాందేవ్ కు యూనివర్శిటీ డాక్టరేట్‌ను ఇవ్వడం పట్ల పలు విమర్శలు చెలరేగాయి. అయితే, వీటిని హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు కొట్టిపారేశారు. రాందేవ్ కు మాత్రమే కాకుండా యూనివర్శిటీ గతంలో పలువురుకి గౌరవ డాక్టరేట్‌ను అందచేసిందని వారు తెలిపారు. యూనివర్శిటీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్, ముఖ్యమంత్రులు ఆమోదించారని వారు తెలిపారు.
Advertisement