ఈద్ మిఠాయిలు తిరస్కరించిన పాక్ జవాన్లు!
దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు ఉన్నా భారత్, పాక్ సైనికులు సరిహద్దుల్లో పరస్పరం స్వీట్లు, బహుమతులు పంచుకోవడం ఆనవాయితీ. కానీ, ఆ సంప్రదాయానికి శనివారం తెరపడింది. ఈదుల్ ఫితర్ సందర్భంగా భారత సరిహద్దు భద్రతాదళం ఇచ్చిన మిఠాయిలను పాకిస్థానీ రేంజర్లు తిరస్కరించారు. సాధారణంగా పండుగల సమయంలో 18 నుంచి 20చోట్ల రెండు దేశాల బలగాలు స్వీట్లు పంచుకుంటాయని, కానీ శనివారం కేవలం 5-6 చోట్ల మాత్రమే స్వీట్లు పంచుకున్నాయని ఓ అధికారి తెలిపారు. జమ్ముకశ్మీర్‌ల్లోని రాజౌరీ, పూంచ్ […]
Advertisement
దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు ఉన్నా భారత్, పాక్ సైనికులు సరిహద్దుల్లో పరస్పరం స్వీట్లు, బహుమతులు పంచుకోవడం ఆనవాయితీ. కానీ, ఆ సంప్రదాయానికి శనివారం తెరపడింది. ఈదుల్ ఫితర్ సందర్భంగా భారత సరిహద్దు భద్రతాదళం ఇచ్చిన మిఠాయిలను పాకిస్థానీ రేంజర్లు తిరస్కరించారు. సాధారణంగా పండుగల సమయంలో 18 నుంచి 20చోట్ల రెండు దేశాల బలగాలు స్వీట్లు పంచుకుంటాయని, కానీ శనివారం కేవలం 5-6 చోట్ల మాత్రమే స్వీట్లు పంచుకున్నాయని ఓ అధికారి తెలిపారు. జమ్ముకశ్మీర్‌ల్లోని రాజౌరీ, పూంచ్ సెక్టార్లలో పాకిస్థానీ సైన్యం శనివారం 12 గంటల వ్యవధిలోనే రెండుసార్లు కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళలు గాయపడ్డారని సైనికాధికారి ఒకరు తెలిపారు. ఈ సెక్టార్లలో పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడటం గత నాలుగురోజుల్లో ఇది ఆరోసారి.
Advertisement