దేవేందర్ గౌడ్‌కు తెలంగాణ టీడీపీ బాధ్యతలు ?
అనారోగ్య సమస్యల కారణంగా చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల విభజన మంచి పరిణామమని ఆయన స్వాగతించారు. దీనికి సంబంధించిన ప్రణాళిక, కార్యచరణను త్వరలోనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖతో దేవేందర్ గౌడ్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లయింది. ఆయన రావడం వెనక చంద్రబాబు […]
Advertisement
అనారోగ్య సమస్యల కారణంగా చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్ ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రజల సౌలభ్యం కోసం జిల్లాల విభజన మంచి పరిణామమని ఆయన స్వాగతించారు. దీనికి సంబంధించిన ప్రణాళిక, కార్యచరణను త్వరలోనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖతో దేవేందర్ గౌడ్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లయింది. ఆయన రావడం వెనక చంద్రబాబు వ్యూహం ఉందా? అని పలువురు చర్చించుకుంటున్నారు ఓటుకు నోటు కుంభకోణం కేసులో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడటం, ఎర్రబెల్లి ఇల్లు విడిచి బయటికి రాకపోవడంతో ఈ ప్రాంతంలో టీడీపీలో చలనం లోపించింది. రావుల చంద్రశేఖర్‌లాంటి వారు ఉన్నా.. వారు టీఆర్ ఎస్ ముందు తేలిపోతున్నారు. వారు విసిరిన సవాళ్లను ఎదిరించలేక ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కే పరిమితమవుతున్నారు. ఈ సమయంలో పార్టీని నడిపించడానికి దూకుడు కంటే అనుభవజ్ఞుడి అవసరం ఎంతో ఉంది. అందుకే చంద్రబాబు తన పాత మిత్రుడు దేవేందర్‌గౌడ్‌ను రంగంలోకి దించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంతో రాజకీయ చతురత, సుదీర్ఘ అనుభవం కలిగిన దేవేందర్‌గౌడ్ నేరుగా టీఆర్ ఎస్‌పై విమర్శలు చేయకుండా ప్రజాసమస్యలపై క్రమంగా నిలదీసేందుకు జిల్లాల విభజన అంశంపై సీఎంకు లేఖ రాశారని విశ్లేషిస్తున్నారు. మెల్లిగా తెలంగాణలో టీడీపీ బాధ్యతలను ఆయనకు అప్పగించినా ఆశ్చర్యపోనవసరం లేదని చర్చించుకుంటున్నారు.
Advertisement