యాసిన్ భత్కల్ పరారీ ప్లాన్ నిజమేనా?

ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు, దేశవ్యాప్తంగా అనేక బాంబు పేలుళ్లకు కారకుడైన కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్‌ను జైలు నుంచి తప్పించేందుకు ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గుర్తించింది. చర్లపల్లి జైల్లో ఉన్న అతన్ని తప్పించేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు వేస్తున్నట్లు ఐబీ నుంచి జైలు అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ హెచ్చరికలతో ఒక ప్లాటూన్ (30 మంది) ఆక్టోపస్ బలగాలతో జైలు వద్ద శుక్రవారం రాత్రి నుంచి భద్రతను […]

Advertisement
Update:2015-07-18 22:57 IST
ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు, దేశవ్యాప్తంగా అనేక బాంబు పేలుళ్లకు కారకుడైన కరుడుగట్టిన ఉగ్రవాది యాసిన్ భత్కల్‌ను జైలు నుంచి తప్పించేందుకు ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కుట్ర పన్నుతున్నట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గుర్తించింది. చర్లపల్లి జైల్లో ఉన్న అతన్ని తప్పించేందుకు ఉగ్రవాదులు ప్రణాళికలు వేస్తున్నట్లు ఐబీ నుంచి జైలు అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఈ హెచ్చరికలతో ఒక ప్లాటూన్ (30 మంది) ఆక్టోపస్ బలగాలతో జైలు వద్ద శుక్రవారం రాత్రి నుంచి భద్రతను కట్టుదిట్టం చేశారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన యాసిన్ భత్కల్‌తోపాటు చర్లపల్లి జైలులో 13 మంది ఉగ్రవాదులున్నారు. వీరందర్నీ హై సెక్యూరిటీ జోన్‌లో భారీ భద్రత మధ్య ప్రత్యేక బ్యారక్‌లో ఉంచారు. జైలు నుంచి తప్పించుకోబోతున్నట్లు జైల్లోని ఫోన్ ద్వారానే తన కుటుంబసభ్యులకు భత్కల్ చెప్పినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మధ్య కాలంలో అతడు చేసిన 27 ఫోన్స్ కాల్స్ రికార్డ్‌ను అధికారులు పరిశీలించారు. భత్కల్‌ను తప్పించేందుకు స్లీపర్ సెల్స్ ప్రణాళికలు వేస్తున్నట్లు గుర్తించారు. తాము భత్కల్‌ చేసిన ఫోన్‌ సంభాషణలన్నీ విన్నామని, తప్పించుకునే విషయమై తమకేమీ సమాచారం లభించలేదని, కేవలం మీడియాలో వచ్చినవన్నీ ఆధార రహిత వార్తలేనని జైళ్ళ శాఖ ఐజీ చెప్పారు. గత 15 రోజుల్లో మూడుసార్లు రంగారెడ్డి కోర్టు ఆవరణలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజరు పరిచిన సమయంలో భత్కల్ హల్‌చల్ సృష్టించాడు. ఒకసారి భద్రత పేరుతో ఒక పేపర్‌ను కోర్టు ఆవరణలో విడిచిపెట్టాడు. రెండోసారి రోజా పూవును చూపించి కోర్టు ఆవరణలో పోలీసులను పరుగులు పెట్టించాడు. మూడోసారి ఒక నోట్‌బుక్‌ను చూపిస్తూ హల్‌చల్ చేశాడు. చర్లపల్లి జైలు అధికారులపై కూడా ఫిర్యాదు చేశాడు. యాసిన్ భత్కల్ ఉంటున్న బ్యారక్ వద్ద సీసీ కెమెరాలు, సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అకస్మాత్తుగా ఆక్టోపస్ బలగాలు రంగంలోకి దిగడంతో యాసిన్ భత్కల్ పారిపోయేందుకు చేస్తున్న కుట్ర వాస్తవమేనన్న అనుమానాలు వ్యక్తమతున్నాయి. ఈ విషయంపై చర్లపల్లి జైలు సూపరింటెంటెండ్ వెంకటేశ్వర్‌రెడ్డిని సంప్రదించగా నిఘా వర్గాల నుంచి ఏదైనా సమాచారం ఉండి ఉంటుంది.. అందువల్లే ఆక్టోపస్ బలగాలు వచ్చి ఉంటాయని తెలిపారు.
Tags:    
Advertisement

Similar News